రానా ఆ హీరోయిన్ ని అంతగా ప్రేమించారా..?
రానా ఎంతోమంది హీరోలతో ఎఫైర్ నడిపినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఆ మధ్యకాలంలో ఆయన పెళ్లికి ముందు మాత్రం ఒక హీరోయిన్ ని చాలా గాఢంగా ప్రేమించినట్లు టాలీవుడ్ లో వార్తలు వినిపించాయి. అయితే రానా ఎట్టకేలకు మీహికా బజాజ్ ను వివాహం చేసుకున్నారు. అయితే రానాకు పెళ్లి కాకముందే రాగిణిని ప్రేమించినట్లుగా అప్పట్లో వార్తలు వైరల్ గా మారాయి. అయితే ఇక్కడ గమనించదగ్గ విషయమేమిటంటే అసలు రానా,రాగిణి కలిసి ఏ ఒక్క చిత్రంలో కూడా నటించలేదు.. ఈమె 2009లో కన్నడలో వచ్చిన వీర మడక్కరి అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.
టాలీవుడ్ లోకి మాత్రం నాని నటించిన జెండాపై కపిరాజు సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో ఈమె ఎవరనే విషయం పెద్దగా తెలియదు.రాగిణి హీరోయిన్ గా కాకముందే మోడల్ గా ఉండేదట.రానా కూడా మోడల్ కావడంతో అలా ఏర్పడిన పరిచయంతో వీరిద్దరి మధ్య ఏదో ఉన్నట్లుగా వార్తలు వినిపించాయి.అయితే ఆ తర్వాత డ్రగ్స్ విషయంలో కూడ సంజన తో పాటు రాగిణి పై ఆరోపణలు రావడంతో ఆమె కెరియర్ మరింత కాంట్రవర్సీగా మారిపోయింది. మరి ఈ వార్తలు లో ఎంత నిజం ఉంది అనే విషయం తెలియాల్సి ఉంది.