వావ్: పుష్ప 2లో మరొక లేడీ విలన్..!!
తాజాగా ఇప్పుడు ఒక విషయం వైరల్ గా మారుతుంది ఈ సినిమాలో అనసూయ నెగటివ్ షెడ్లో కనిపించబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. మంగళం శ్రీను భార్య పాత్రలో అనసూయ బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు పుష్ప 2 లో కూడా లేడీ విలన్ ను క్రియేట్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారట సుకుమార్. ఆ పాత్రలో టాలీవుడ్ హీరోయిన్ కేథరిన్ ను ఎంపిక చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ హీరోగా గతం లో నటించిన సరైనోడు సినిమా లో ఈమె హీరోయిన్ గా నటించింది.
మొత్తానికి పుష్ప 2 సినిమా విషయంలో పలు రకాల ప్రచారణలు అయితే జరుగుతున్నాయి.. కానీ ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాల గురించి ఎలాంటి అధికారికంగా ప్రకటన వెలుపడలేదు.ఈ సినిమా యొక్క విడుదల తేదీ విషయంలో కూడా పలు రకాల వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. గడిచిన కొద్ది రోజుల క్రితం కొంతమంది అల్లు అర్జున్ అభిమానులు కూడా పుష్ప 2 సినిమా అప్డేట్ తెలియజేయాలి అంటే ధర్నా చేసిన సంగతి తెలిసిందే. మరి అన్నిటికీ చెక్ పెట్టే విధంగా సుకుమార్ పుష్ప 2 చిత్రంపై ఎప్పుడు క్లారిటీ ఇస్తారో తెలియాల్సి ఉంది.