కొన్ని సంవత్సరాల క్రితం
విశ్వక్ సేన్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వం లో నాచురల్ స్టార్
నాని నిర్మాతగా తెరకెక్కిన హిట్ ది ఫస్ట్ కేస్
మూవీ అద్భుతమైన విజయాన్ని
బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. హిట్ ది ఫస్ట్ కేస్
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడం మాత్రమే కాకుండా అద్భుతమైన కలెక్షన్ లను కూడా
బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఇలా హిట్ ది ఫస్ట్ కేస్
మూవీ మంచి విజయం సాధించడం తో ఈ
మూవీ కి సీక్వల్ గా హిట్ ది సెకండ్ కేస్ అనే
మూవీ ని దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించాడు. ఈ
మూవీ లో అడవి శేషు హీరోగా నటించగా , నాచురల్ స్టార్
నాని ఈ
మూవీ ని నిర్మించాడు. ఈ
మూవీ లో అడవి శేషు సరసన మీనాక్షి
చౌదరి హీరోయిన్ గా నటించింది. ఈ
మూవీ ని
డిసెంబర్ 2 వ తేదీన
థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ
మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ
మూవీ యూనిట్ ఈ
సినిమా ప్రమోషన్ లను ఫుల్ స్పీడ్ లో నిర్వహిస్తోంది.
ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ
మూవీ యూనిట్ ఈ
సినిమా నుండి టీజర్ ను విడుదల చేయగా , ఆ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. తాజాగా ఈ
మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ ను విడుదల చేసింది. తాజాగా ఈ
మూవీ లో హీరోగా నటిస్తున్న అడవి శేషు మరియు ఈ
మూవీ కి నిర్మాతగా వ్యవహరించిన నాచురల్ స్టార్
నాని ఒక వీడియో ద్వారా హిట్ ది సెకండ్ కేస్
మూవీ ట్రైలర్ ను
నవంబర్ 23 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ
మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.