చిన్న సినిమాను చూసి పెద్ద సినిమా మారబోతోందా..?

Divya
ఆది పురుష్.. హనుమాన్.. రెండూ కూడా హిందూ మతం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలే అని చెప్పవచ్చు. కానీ పాన్ ఇండియా రేంజ్ లో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఆది పురుష్ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ (రాముడు) హీరోగా.. కృతి సనన్ (సీత) హీరోయిన్గా , సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా, దేవ దత్తనాగే ఇలా తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అందరూ అంచనాలు పెట్టుకున్నారు . కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేదు. పైగా విమర్శల పాలైంది. 3డీ సినిమా రూపంలో విడుదల చేయబోతున్నామని చెప్పిన దర్శక నిర్మాతలపై.. చిన్నపిల్లల కోసం సినిమా తీశారా అంటూ నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాదు ఈ సినిమాలో రావణుడిని చూపించిన తీరు హిందూ మతాన్ని తప్పు పట్టేలా ఉందని.. రాముడు సాధారణ మనిషి.. కండలు తిరిగిన వాడు కాదు అంటూ ఇలా రకరకాలుగా ఈ సినిమాపై నెగెటివిటీ స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగా మరో వైపు తాజాగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యంగ్ హీరో తేజ సజ్జా తెరకెక్కిస్తున్న చిత్రం హనుమాన్ . ఈ సినిమా కూడా హిందూ మతం ఆధారంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకోవడమే కాకుండా ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి.
ఇక ఇప్పుడు రూ.500 కోట్ల బడ్జెట్తో తెరకెక్కబోతున్న ఆది పురుష్ సినిమా కంటే.. 10% తక్కువ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న హనుమాన్ సినిమా చాలా బెటర్ అంటూ నేటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే హనుమాన్ టీజర్ చూసిన తర్వాత ఆది పురుష్ లో కూడా మార్పులు చేయబోతున్నట్లు సమాచారం. మరి ఈ రెండింటిలో ఏ సినిమా సక్సెస్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: