లవ్ టుడే అనే
తమిళ సినిమా నవంబర్ 25 వ తేదీన తెలుగు భాషలో విడుదల కావడానికి రెడీగా ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ లో
ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించాడు. ఈ
మూవీ లో
ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించడం మాత్రమే కాకుండా ఈ
మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే
లవ్ టు డే
సినిమా తమిళం లో భారీ ఎత్తున
నవంబర్ 4 వ తేదీన విడుదల అయింది. మంచి అంచనాల నడుమ
తమిళ భాషలో విడుదల అయిన ఈ
సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే
బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకుంది.
దానితో ఈ
మూవీ కి ప్రస్తుతం
తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లు కూడా లభిస్తున్నాయి. ఇలా ఇప్పటికే
తమిళ ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ
మూవీ ని
నవంబర్ 25 వ తేదీన ప్రముఖ
నిర్మాత దిల్ రాజు భారీ స్థాయిలో తెలుగు లో విడుదల చేయడానికి ఏర్పాటు చేస్తున్నాడు. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ
సినిమా ట్రైలర్ ను
టాలీవుడ్ హీరో
విజయ్ దేవరకొండ విడుదల చేశాడు. ఈ
మూవీ ట్రైలర్ అద్భుతంగా ఉండడం తో , ఈ
మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా
లవ్ టుడే
మూవీ యూనిట్ ఈ
సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది.
ఈ
మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించింది. అలాగే ఈ
మూవీ యూనిట్ ఈ
సినిమా రన్ టైమ్ ను కూడా లాక్ చేసింది.
లవ్ టు డే
సినిమా 2గంటల 34 నిమిషాల నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి లైవ్ టుడే
సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆలరిస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.