ఫైర్ బ్రాండ్ కోసం తాప్సి పరితపిస్తోందా..?

Divya
టాలీవుడ్లో మొదట ఝుమ్మంది నాదం చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యింది హీరోయిన్ తాప్సి. ఆ తర్వాత కొన్ని సినిమాలలో నటించినా పెద్దగా పేరు రాకపోవడంతో బాలీవుడ్ లో అడుగు పెట్టింది. బాలీవుడ్ లో ఒక్కసారిగా ఈమె చేంజ్ ఓవర్ చేస్తూనే ఉన్నది. టాలీవుడ్ లో ఉన్నంతకాలం చాలా సైలెంట్ గా ఉన్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ వెళ్లేసరికి మొత్తం ఒక్కసారిగా తన విధానాన్నే మార్చేసింది. ముఖ్యంగా తనలో ఉండే డేరింగ్ నెస్ ని బయటపెట్టింది తాప్సి. ఎలాంటి విషయాన్ని అయినా సరే ముక్కుసూటిగా మాట్లాడగలిగేటట్టు మారిపోయింది.

ఎన్నో వివాదాలు తలెత్తినా తనదైన స్టైల్ లో స్పందిస్తూ ఉంటుంది. ఎవరైనా వ్యక్తిగతంగా తనను టార్గెట్ చేస్తూ చేస్తే.. వారిపై కౌంటర్లు వేయడం జరుగుతూ ఉంటుంది తాప్సి. ఇలా పలు విషయాలలో తనను మార్పు చేసుకుంది తాప్సి.. ఇటీవల ఒక స్టార్ హీరోయిన్.. తాప్సీ కంగానాల మరో ఫైర్ బ్రాండ్ దిగబోతోంది అంటూ ఆకాశానికి ఎత్తేసింది. కొన్ని విషయాలలో తనకి తాప్సికి పడకపోయినా తనలో డేరింగ్ నెస్ కి ఫిదా అయ్యాను అంటూ ఆ సదరు హీరోయిన్ తెలియజేసింది. ఇక తాప్సి కూడా కంగానా ల నటిగా కూడా అంతే కమిట్మెంట్తో కెరీయర్ని ప్లాన్ చేసుకుంటూ సోలోగానే మంచి క్రియేట్ ను సంపాదించుకుంటుంది

తాప్సి నటిగా కొనసాగిస్తూనే ఇటీవల నిర్మాతగా కూడా పలు చిత్రాలను తెరకెక్కిస్తూ ఉంది.  తన నిర్మాణ సంస్థలలో లేడీ ఒరియెంటెడ్ సినిమాలు చేసి హీరోయిన్లు.. హీరోలకి ఏమాత్రం తీసిపోరు అని చాటి చెప్పేలా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.  అందుకు తగ్గట్టుగానే తన బ్యానర్ లో సమంతతో ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా నిర్మించబోతున్నట్లు గతంలో వార్తలు వినిపించాయి. ఇకపోతే  తాప్సి కంగానాల మారిపోవాలని చూస్తోంది అంటూ పలువురు నెటిజన్ల సైతం కామెంట్ చేస్తూ ఉన్నారు. మరి కంగనా ల పాపులారిటీ అవుతుందో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: