ఆ విషయంలో అల్లు అర్జున్ కంటే ఎన్టీఆరే తోపా..!
ఈ క్రమంలోనే గతంలో అల్లు అర్జున్ జొమాటో ఫుడ్ డెలివరీ ఆప్ కోసం బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేయగా ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా లిషీయస్ ఫుడ్ ఆర్గనైజేషన్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే ఈ యాడ్ కు సంబంధించి ఎన్టీఆర్ లుక్ బయటకి రాగా .. అందరూ కూడా ఆ లుక్ చూసి సినిమా కోసం అనుకున్నారు.. కానీ యాడ్ అని తెలిసి మరింత సంబరపడిపోతున్నారు. తాజాగా ఈ యాడ్ నిన్న విడుదల అవ్వగా ఊహించని రేంజ్ లో వ్యూస్, లైక్స్ సొంతం చేసుకోవడం గమనార్హం.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..ట్విట్టర్ అధికారిక ఖాతాలో జొమాటో కోసం అల్లు అర్జున్ చేసిన ప్రకటన కంటే.. ఎన్టీఆర్ కొత్త యాడ్ ఎక్కువ లైక్‌లను పొందింది. నిజానికి జోమాటో.. లిషీయస్ కంటే ఎక్కువ ఫాలోవర్స్ ను కలిగి ఉన్న విషయం తెలిసిందే. కానీ అల్లు అర్జున్ కంటే ఎన్టీఆర్ నటించిన యాడ్ కే ఎక్కువ లైక్ లు రావడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే అల్లు అర్జున్ కంటే ఎన్టీఆర్ కి ఎక్కువ ఫాలోయింగ్ ఉందని స్పష్టమవుతోంది. ఏది ఏమైనా ఇద్దరూ కూడా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించి మరింత పాపులారిటీని దక్కించుకున్నారని చెప్పవచ్చు.