కన్నడ
సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటు వంటి
రిషబ్ శెట్టి తాజాగా కాంతారా అనే
మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ లో
రిషబ్ శెట్టి
హీరో గా నటించడం మాత్రమే కాకుండా , ఈ
మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు. కాంతారా
మూవీ లో
రిషబ్ శెట్టి సరసన సప్తమి గౌడ
హీరోయిన్ గా నటించింది. ఈ
మూవీ మంచి అంచనాల నడుమ
కన్నడ భాషలో
సెప్టెంబర్ 30 వ తేదీన విడుదల అయ్యింది. ఆ తర్వాత ఈ
మూవీ ని తెలుగు భాషలో
అక్టోబర్ 15 వ తేదీన విడుదల చేశారు. తెలుగు భాషలో కూడా ఈ
మూవీ కి అద్భుతమైన
బ్లాక్ బస్టర్ టాక్ రావడం తో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన కలెక్షన్ లు లభించాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
మూవీ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఈ
మూవీ "ఓ టి టి" హక్కులను ప్రముఖ "ఓ టి టి" సంస్థలలో ఒకటి అయినటు వంటి
అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకుంది. ఈ
మూవీ ని ఈ రోజు నుండి అనగా
నవంబర్ 24 వ తేదీ నుండి
అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" సంస్థ తమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తోంది. ఎవరైనా కాంతారా
మూవీ ని
థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ఈ రోజు నుండి అనగా
నవంబర్ 24 వ తేదీ నుండి ఈ
సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి. ఇది ఇలా ఉంటే
థియేటర్ లలో భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్ లను
బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసిన కాంతారా
మూవీ "ఓ టి టి" ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.