టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నడూ లేని విధంగా స్టార్ హీరోలు కథ నచ్చకపోతే ఆ ప్రాజెక్ట్ ని ఆపివేసి అదే డైరెక్టర్ తో మరో స్టోరీ ని సిద్ధం చేయిస్తున్నారు..అయితే ఇంతకీ ఆ హీరోలు మరెవరో కాదు..పవన్ కళ్యాణ్, మహేష్ బాబు..మహేష్ బాబు తన తదుపరి చిత్రం త్రివిక్రమ్ తో చేస్తున్న సంగతి తెలిసిందే..ఇక ఇటీవలే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించి ఒక షెడ్యూల్ ని కూడా పూర్తి చేసాడు..కానీ మహేష్ బాబు కి ఆ షెడ్యూల్ ఔట్పుట్ ఏ మాత్రం నచ్చలేదట.ఇకపోతే 'ఈ కథ ఎందుకో నాకు తేడా కొడుతోంది..ఇక మూవీ ని ఆపేద్దాం..వేరే కథ చేద్దాం..
మీకు కథ డెవలప్ చెయ్యడానికి ఒక టీం ని కూడా ఏర్పాటు చేస్తాను' అని మహేష్ త్రివిక్రమ్ తో చెప్పాడట..త్రివిక్రమ్ కూడా అందుకు ఓకే చెప్పాడు..ఇదిలావుంటే ఇప్పుడు సరికొత్త కథ సిద్ధం అయిపోయింది..ముందు అనుకున్న కథ తో కాకుండా ఇప్పుడు సరికొత్త కథ తో డిసెంబర్ నెల నుండి షూటింగ్ ని ప్రారంభించబోతున్నారట.అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయం లో కూడా ఇదే జరిగింది..గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో 'భవదీయుడు భగత్ సింగ్' తెరకెక్కబోతుంది మూడేళ్ళ క్రితం అధికారిక ప్రకటన చేసారు..ఇక ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేసాడు డైరెక్టర్ హరీష్ శంకర్.హరీష్ శంకర్ వినిపించిన ఫైనల్ స్క్రిప్ట్ న్యారేషన్ పవన్ కళ్యాణ్ కి నచ్చలేదట..
ఎక్కడో కథలోని సహజత్వం మిస్ అవుతుంది..ఇక కొన్ని మార్పులు చేసి తీసుకొనిరా అని చెప్పాడట..పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగానే స్క్రిప్ట్ లో కీలక మార్పులు చేసి తీసుకొచ్చాడు హరీష్ శంకర్..అయినా కానీ పవన్ కళ్యాణ్ సంతృప్తి చెందలేదు..ఇక దీనితో భవదీయుడు భగత్ సింగ్ చిత్రాన్ని ఆపేసి వేరే కథని సిద్ధం చెయ్యమని చాలా రోజుల క్రితమే హరీష్ కి చెప్పాడట పవన్ కళ్యాణ్.ఇక ఆయన చెప్పినట్టు గానే కొత్త స్టోరీ పాయింట్ ని తీసుకొని స్క్రిప్ట్ వర్క్ మొత్తాన్ని పూర్తి చేసాడట హరీష్ శంకర్..ఇదిలావుంటే ఇటీవలే పవన్ కళ్యాణ్ ని కలిసి ఫైనల్ న్యారేషన్ ఇచ్చాడట..పవన్ కళ్యాణ్ కి స్టోరీ బాగా నచ్చేసింది..ఇక డిసెంబర్ లో పూజా కార్యక్రమాలు పెట్టుకోమని హరీష్ శంకర్ కి మరియు నిర్మాతలకు చెప్పేశాడట పవన్ కళ్యాణ్..అయితే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జనవరి నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంది..ఇక అలా ఈ ఇద్దరు టాప్ హీరోలు ముందు అనుకున్న కథలతో కాకుండా సరికొత్త కథలతో సెట్స్ మీద వెళ్లనున్నారు...!!