తమిళ
సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటు వంటి
లోకేష్ కనకరాజు గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
లోకేష్ కనకరాజు ఇప్పటికే మా నగరం ,
ఖైదీ ,
మాస్టర్ ,
విక్రమ్ మూవీ లకు దర్శకత్వం వహించి దేశ వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటివరకు ఈ దర్శకుడు దర్శకత్వం వహించిన అన్ని సినిమాలు కూడా
టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకోవడంతో తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో ఈ దర్శకుడి కి అద్భుతమైన క్రేజ్ ఉంది. ఈ సంవత్సరం విడుదల అయిన
విక్రమ్ మూవీ తో
లోకేష్ కనకరాజు అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఈ
మూవీ పాన్
ఇండియా రేంజ్ లో విడుదల అయ్యి అద్భుతమైన విజయం సాధించడం తో , ఈ దర్శకుడి కి పాన్
ఇండియా రేంజ్ లో క్రేజీ లభించింది.
మరికొన్ని రోజుల్లో
లోకేష్ కనకరాజు ,
దళపతి విజయ్ హీరోగా తెరకెక్కబోయే
మూవీ కి దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ
మూవీ దళపతి విజయ్ కెరియర్ లో 67 వ
మూవీ గా రూపొందబోతుంది. ఈ
మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ఈ దర్శకుడు
టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి
రెబల్ స్టార్ ప్రభాస్ తో ఒక
మూవీ ని చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ దర్శకుడు
ప్రభాస్ కు కథను వినిపించడానికి ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో కనక
సినిమా రూపొందినట్లు అయితే ఆ సినిమాకు దేశ వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ నెలకొనే అవకాశం ఉంది.