ప్రామిసింగ్ నటుడు సత్యదేవ్ తాజాగా గుర్తుందా శీతాకాలం అనే
మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ
మూవీ లో సత్యదేవ్ సరసన మిల్కీ
బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించింది . ఈ
మూవీ కి
నాగ శేఖర్ దర్శకత్వం వహించగా ,
కాల భైరవ ఈ
మూవీ కి సంగీతం అందించాడు . ఇప్పటికే ఈ
మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయ గా వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది . తాజాగా ఈ
మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక అదిరి పోయే అప్డేట్ ను విడుదల చేసింది . తాజాగా గుర్తుందా శీతాకాలం
మూవీ యూనిట్ ఈ
సినిమా విడుదల తేదీని ప్రకటించింది. గుర్తుందా సీతాకాలం
మూవీ ని
డిసెంబర్ 9 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా
థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక
పోస్టర్ ను కూడా విడుదల చేసింది.