మోస్ట్
బ్యూటిఫుల్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి ప్రియ భవాని
శంకర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటి వరకు ఎక్కువగా
తమిళ సినిమాలలో నటించి మంచి గుర్తింపును దక్కించుకుంది. ఈ సంవత్సరం విడుదల అయిన తిరు
మూవీ తో ఈ ముద్దుగుమ్మ మంచి విజయాన్ని
బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది.
ధనుష్ హీరోగా తెరకెక్కిన తిరు
మూవీ లో
నిత్య మీనన్
హీరోయిన్ గా నటించగా , ప్రియ భవాని
శంకర్ ఒక కీలకమైన పాత్రలో నటించింది. ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాలో తక్కువ నడివి ఉన్న పాత్రలోనే కనిపించినప్పటికీ తన నటన తో , అందచందాలతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అలాగే
హరి దర్శకత్వంలో
అరుణ్ విజయ్ హీరోగా తెరకెక్కిన ఏనుగు
మూవీ లో కూడా ఈ ముద్దుగుమ్మ
హీరోయిన్ గ నటించింది.
ఇలా ప్రస్తుతం
తమిళ సినిమా ఇండస్ట్రీ లో ఈ ముద్దుగుమ్మ వరుస అవకాశాలను దక్కించుకుంటుంది. ఇది ఇలా ఉంటే ప్రియ భవాని
శంకర్ నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే సోషల్
మీడియా వేదికగా ఈ ముద్దు గుమ్మ తన అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటుంది. అలాగే తనకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తుంది. తాజాగా ప్రియ భవాని
శంకర్ తన సోషల్ మీడియాలో కొన్ని పిక్స్ ను పోస్ట్ చేసింది. అందులో ఈ ముద్దుగుమ్మ లైట్ గ్రీన్ కలర్ లో ఉన్న శారీని కట్టుకొని , వైట్ కలర్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి చాలా క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ప్రియ భవాని
శంకర్ కు సంబంధించిన ఈ క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.