మెగా
పవర్ స్టార్ రామ్ చరణ్ తన కెరియర్ లో ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ బాస్టర్
మూవీ లలో హీరోగా నటించి ప్రస్తుతం
టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఇది ఇలా ఉంటే మెగా
పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సంవత్సరం విడుదల అయిన ఆర్ ఆర్ ఆర్
మూవీ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు . ప్రస్తుతం
రామ్ చరణ్ ,
శంకర్ దర్శకత్వంలో తెరకెక్కు తున్న
మూవీ లో
హీరో గా నటిస్తున్నాడు . ఇది ఇలా ఉంటే
రామ్ చరణ్ కెరియర్ లో
బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించకపోయినప్పటికీ ఇప్పటికీ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్న
మూవీ లలో ఆరెంజ్
మూవీ ఒకటి. ఈ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించక పోయిbనప్పటికీ ఇప్పటికీ ఈ
మూవీ టీవీ లలో ప్రసారం అయినప్పుడు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది .
ఈ
మూవీ లో జెనీలియా
హీరోయిన్ గా నటించగా , బొమ్మలిల్లు
భాస్కర్ ఈ
మూవీ కి దర్శకత్వం వహించాడు . నాగబాబు ఈ
మూవీ ని నిర్మించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
మూవీ విడుదల అయ్యి 12 సంవత్సరాలు పూర్తి అయింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
మూవీ ని రీ రిలీజ్ చేయాలి అని ఫాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఆ క్రమంలో నాగబాబు స్పందిస్తూ ... ఎప్పటికీ రిఫ్రెష్ చేసే సంగీతం ,
ప్రేమ కథ కలిగిన ఆరెంజ్
మూవీ ఎంతో మంది హృదయాల్లో చోటు దక్కించుకుంది. ఫ్యాన్స్ డిమాండ్ మేరకు త్వరలోనే ఆరెంజ్
మూవీ ని రీ రిలీజ్ చేస్తాం అని నాగబాబు స్పందించాడు.