HBD: రాశి ఖన్నా గురించి తెలియని అతి కొద్ది రహస్యాలు ఇవే..!
తెలుగులో అవసరాల శ్రీనివాస్ తొలిసారిగా దర్శకత్వం వహించిన "ఊహలు గుసగుసలాడే" చిత్రం ద్వారా హీరోయిన్గా వెండితెరకు పరిచయమయ్యింది. ఈ సినిమాలో ఈమెకు జోడిగా యంగ్ హీరో నాగ శౌర్య నటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మనం సినిమాలో అతిథి పాత్రలో నటించి మెప్పించిన రాశిఖన్నా జోరు, జిల్ , బెంగాల్ టైగర్, శివం , సుప్రీం, హైపర్, జై లవకుశ, రాజా ది గ్రేట్ వంటి చిత్రాలలో నటించింది. ఆ తర్వాత 2017 మలయాళంలో విలన్ అనే సినిమాలో హర్షిత చోప్రా అనే పాత్రలో హీరోయిన్గా నటించి మెప్పించిన ఈమె ఆ తర్వాత తమిళంలో సుమారుగా ఐదు పైగా చిత్రాలలో నటించింది.
ఇటీవల పక్కా కమర్షియల్ , థాంక్యూ, తిరు, సర్దార్ వంటి చిత్రాలలో నటించిన రాశి ఖన్నా మిగతా మూడు సినిమాలతో పెద్దగా గుర్తింపు లభించలేదు. కానీ సర్దార్ సినిమాతో భారీ పాపులారిటీని సొంతం చేసుకుంది. కేవలం తెలుగు, తమిళ్ , మలయాళం చిత్రాలలోనే కాదు బుల్లితెరపై కూడా అలరించడానికి పలు వెబ్ సిరీస్లలో నటిస్తోంది . ప్పటికి మొదటిసారి రుద్ర : ది ఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్ వంటి తొలి వెబ్ సిరీస్ లో డాక్టర్ ఆలియా చోక్స్ క్యారెక్టర్ లో నటించి మెప్పించింది. ప్రస్తుతం రాజ్ నిడిమోరు మరియు కృష్ణ డీకే లతో కలిసి ఒక వెబ్ సిరీస్ లో నటిస్తోంది. అయితే ఈ సీరిస్ ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.