#SSMB 29 లేటెస్ట్ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి..!
రాజమౌళి తన తర్వాత కథలో ఎలాంటి మలుపులతో తీసుకొస్తారో? ఏ నేపథ్యంలో తీసుకొస్తారో? ఎటువంటి తారాగణంతో ప్రేక్షకుల ముందుకు వస్తారు? అని ప్రతి ఒక్కరు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన తండ్రి విజయేంద్ర వర్మ రచయితగా రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కబోతున్న మరొక సినిమా మహేష్ బాబుతో అని తెలిసి ఇప్పటికే అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. మరొకవైపు ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే ఈ కథ మరింత ఆసక్తిగా సాగుతుందని విజయేంద్ర వర్మ కూడా స్పష్టం చేశారు. అంతేకాదు మహేష్ బాబు కెరియర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలుస్తుంది అని కూడా స్పష్టంగా చేశారు.
ప్రస్తుతం #SSMB 29 వర్కింగ్ టైటిల్ తో మహేష్ బాబుతో రాజమౌళి పనిచేయనున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఆయన ఇటీవల ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహేష్ బాబు 29వ సినిమాకు సంబంధించి కొన్ని పోర్షన్స్ స్క్రిప్ట్ వర్క్ మాత్రమే ప్రారంభమైంది . ఇది చాలా స్పీడ్ గా వర్క్ సాగుతున్న నేపథ్యంలో మిగతా విషయాలను ఇప్పుడే వెల్లడించలేనని కూడా రాజమౌళి ధ్రువీకరించారు. త్వరలోనే మరొక తాజా అప్డేట్ తో మీ ముందుకు వస్తానని కూడా స్పష్టం చేశారు. త్రివిక్రమ్ సినిమా అయిపోగానే రాజమౌళితో మహేష్ బాబు తన పాన్ ఇండియా చిత్రాన్ని మొదలుపెట్టబోతున్నారు. ఈ విషయం తెలిసి అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.