సూపర్ స్టార్ కృష్ణ పెద్దకర్మకు మహేష్ బాబు అన్ని కోట్లు ఖర్చు చేశారా..!?

Anilkumar
సూపర్ స్టార్ కృష్ణ మరణంతో సినీలోకం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. ఇక గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్ లో నవంబర్ 15న ఉదయం నాలుగు గంటలకు తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.కాగా ఆయన అంతిమయాత్రను అశేష అభిమానుల మధ్య నిర్వహించి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేశారు.ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ పెద్దకర్మను మహేశ్ బాబు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి సినీ సెలబ్రిటీలతోపాటు భారీ ఎత్తున అభిమానులు సైతం హాజరయ్యారు.  ప్రస్తుతం ఈ పెద్దకర్మకు అయిన ఖర్చు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

ఇక నటుడు, దర్శకుడు, నిర్మాత, సూపర్ స్టార్ కృష్ణ మరణం సినీ లోకాన్ని కలిచివేసింది. కృష్మ మరణంతో మహేశ్ బాబు కుటుంబం తీవ్ర శోకసంద్రంలోకి వెళ్లింది.అంతేకాదు  అలాగే అభిమానులు, రాజకీయ, సినీ ప్రముఖులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు.కాగా  నవంబర్ 16న అశేష అభిమానుల మధ్య జరిగిన అంతిమయాత్ర అనంతరం ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు నిర్వహించారు.అయితే  ఇక నవంబర్ 27న (ఆదివారం) అంటే సూపర్ స్టార్ కృష్ణ మరణించిన 13వ రోజు పెద్ద కర్మ నిర్వహించారు.ఇకపోతే  ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటి వద్ద శాస్త్రోక్తంగా పూజలు చేశారు.

ఇక ఇంటి వద్ద పూజల అనంతరం అతిథులకు, అభిమానులకు విందు ఏర్పాటు చేశారు. కాగా సూపర్ స్టార్ పెద్దకర్మకు వచ్చే అతిథుల కోసం మహేశ్ బాబు రెండు వేదికలను ఏర్పాటు చేశారు. అంతేకాదు సినీ, రాజకీయ ప్రముఖుల కోసం ఎన్ కన్వెన్షన్ లో విందు ఏర్పాటు చేయగా.. అభిమానుల కోసం జేఆర్సీ కన్వెన్షన్ లో విందు ఇచ్చారు. అభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తారన్న ఉద్దేశంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురవకుండా పాస్ సిస్టమ్ పెట్టారు. ఇక అలా అభిమానులందరికీ పాస్ లు అందజేశారు.అయితే  ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చారు. వారికోసం 32 వంటకాలు తయారు చేశారట.కాగా జేఆర్సీ కన్వెన్షన్ హాల్ లో నిర్వహించిన విందుకు సుమారు నాలుగు నుంచి ఐదు వేల మంది అభిమానులు హాజరైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇక  వీరందరికోసం మొత్తంగా 32 రకాల వంటకాలు తయారు చేశారని టాక్ వినిపించింది. అంతేకాకుండా ఇక  అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: