ఆ తమిళ హీరో కోసం ఎదురుచూస్తున్న ప్రభాస్....!?

Anilkumar
టాలీవుడ్ హీరో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇక ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం మనందరికీ తెలిసిందే.అంతేకాదు సినిమా సినిమాకి తనకున్న క్రేజ్ ను మరింత పెంచుకుంటూ దూసుకుపోతున్నాడు హీరో ప్రభాస్. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ప్రభాస్ కి సంబంధించిన ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. అయితే అదేమిటంటే హీరో ప్రభాస్ తమిళ హీరో సూర్య కోసం ఒక రాత్రి మొత్తం ఎదురు చూశాడట. 

ఇక ఎందుకు ఏమిటి అన్న వివరాల్లో వెళితే.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో సూర్య ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ అసలు విషయాన్ని వెల్లడించారు.అయితే నేను, ప్రభాస్హైదరాబాద్ లో సేమ్ లోకేషన్ లో షూటింగ్ చేశాం. ఇక కలిసినప్పుడు రాత్రి కలిసి భోజనం చేద్దామని ప్రభాస్ నాతో అన్నాడు. అప్పుడు నా కోసం వెయిట్ చేస్తానని చెప్పాడు. సాయంత్రం 6లోపు అయిపోతుందనుకున్నా నా షూటింగ్ కాస్త రాత్రి 11:30 అయిపోయింది.ఇక  దీంతో ప్రభాస్ ని ఇబ్బంది పెట్టడం ఎందుకని ఏదైనా హోటల్, ప్రొడక్షన్ మెస్ లో తినేద్దాం అనుకున్నాను.

ఇక తర్వాతి రోజు ప్రభాస్ ని కలిసి సారీ చెప్పేద్దామనుకున్నా.  నేను షూటింగ్ ముగించుకుని కారిడార్ లో నడుస్తుండగా ప్రభాస్ పిలిచాడు. సర్ నేను రెడీ.మీరు స్నానం చేసి వస్తే భోజనం చేద్దాం అని అన్నాడు.ఇక  నేను ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను. అంతేకాదు రాత్రి చాలా లేట్ అయిపోయింది కదా ఏం వెయిట్ చేస్తారు లే అనుకున్నాను.తన ఇంటి నుంచి ప్రభాస్ బిర్యానీ తెప్పించాడు.అయితే  ప్రభాస్ వాళ్ల అమ్మ చేసిన ఆ బిర్యానీ అయితే చాలా బాగుంది అంటూ సూర్య అప్పట్లో జరిగిన విషయాన్ని చెప్పుకొచ్చారు.అంతేకాదు  కేవలం హీరో సూర్య విషయంలో మాత్రమే కాకుండా ఇప్పటికీ ఎంతోమంది హీరో హీరోయిన్ లకు తన ఇంటి భోజనాన్ని రుచి చూపించాడు హీరో ప్రభాస్. ఇకపోతే చాలామంది హీరో హీరోయిన్ లు సైతం ప్రభాస్ ఇంటి భోజనాన్ని ఇష్టపడుతూ ఉంటారు.ఇక  ప్రభాస్ విషయానికొస్తే ప్రస్తుతం ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్ లాంటి సినిమాలలో నటిస్తే బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: