ధనుష్ - శేఖర్ కమ్ముల కాంబోలో వస్తున్నది థ్రిల్లర్ మూవీ కాదా..?

Divya
ధనుష్ - శేఖర్ కమ్ముల కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుంది అని చాలా కాలం కిందట ప్రకటన వెలువడిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ధనుష్ మాస్ సినిమాలతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంటే.. మరొకవైపు శేఖర్ కమ్ముల క్లాస్ రొమాంటిక్ చిత్రాలతో గుర్తింపును సొంతం చేసుకున్నారు. అలాంటి వీరిద్దరి కాంబినేషన్లో మూవీ అంటే ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. తాజాగా నిన్నటి వరకు అందిన సమాచారం ప్రకారం ధనుష్ శేఖర్ కమ్ముల కాంబినేషన్లో రాబోతున్న సినిమా పొలిటికల్ స్కాం థ్రిల్లర్ మూవీ అని ప్రకటించారు. ఫిదా, లవ్ స్టోరీ వంటి సినిమాల సక్సెస్ నేపథ్యంలో శేఖర్ కమ్ములా కథల విషయంలో పూర్తిగా మారిపోయారు.

లవ్ స్టోరీ సినిమాలో సెన్సిటివ్ అంశాన్ని టచ్ చేసి ప్రశంసలందుకున్న శేఖర్ కమ్ముల.. ధనుష్ కి సూట్ అయ్యే కథను ఎంచుకోవడంతో ఈ సినిమా సక్సెస్ గ్యారంటీ అని కామెంట్ లు వ్యక్తం అవుతున్నాయి.  మరోపక్క కోలీవుడ్ మాస్ హీరో అయి ఉండి టాలీవుడ్ డైరెక్టర్ తో సినిమా చేయడమేంటి అంటూ తమిళ్ ప్రేక్షకులు ధనుష్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఎమోషనల్  థ్రిల్లర్ మూవీ గా ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది అంటూ వార్తలు బాగా వినిపించాయి. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా పొలిటికల్ థ్రిల్లర్ మూవీ కాదు అని రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ అని శేఖర్ కమ్ముల స్పష్టం చేశారు.
ఇప్పుడు ధనుష్ తో శేఖర్ కమ్ముల రొమాంటిక్ మూవీ అనగానే అందరూ 3 సినిమాను గుర్తు చేసుకుంటున్నారు.  మరి శేఖర్ కమ్ముల ధనుష్ ను తన సినిమాలో ధనుష్ ను  ఏ విధంగా చూపించబోతున్నారో తెలియాల్సి ఉంది. మొత్తానికి అయితే మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు శేఖర్ కమ్ముల.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: