పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా వున్నాడు ఈ స్టార్ హీరో .అయితే ఏడేళ్ల క్రితమే గ్లోబల్ ఆఫర్ వచ్చిందట.ఇక చైనా సినిమాకి దిక్సూచీగా నిలిచే జాకీ చాన్.. ప్రభాస్ కోసం ప్రయత్నించారట.కాగా `బాహుబలి` సినిమాని చూసిన ఆయన అందులో ప్రభాస్ నటనకు, బాడీ లాంగ్వేజ్‌కి ఫిదా అయి ఆయనతో సినిమా చేయాలని భావించారట.ఇక ఇండియన్ బాహుబలి ప్రభాస్ ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా మారబోతున్నారు. అయితే ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు సక్సెస్ అయితే వరల్డ్ బిగ్గెస్ట్ యాక్టర్స్ లో ప్రభాస్ ముందు వరుసలో ఉంటారని చెప్పొచ్చు.
ఇక ప్రపంచ సినిమాకి ఇండియన్ నుంచి రిప్రజెంట్ చేసే నటుడిగానూ ప్రభాస్ నిలుస్తారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.అంతేకాదు ప్రభాస్‌తో మార్షల్ ఆర్ట్స్ సినిమా చేయాలని, సినిమాలో సెకండ్ హీరో తరహా పాత్రలో నటించాల్సి ఉంటుందని కృష్ణంరాజుని అప్రోచ్ అయ్యారట జాకీ చాన్. ఇక సినిమాలో తనని కాపాడే పాత్ర అది, ప్రభాస్ చేస్తే బాగుంటుందని జాకీ చాన్ చెప్పారట. ఆ ప్రాజెక్ట్ చేస్తే యాభై కోట్లు రెమ్యూనరేషన్ ఇస్తానని చెప్పారడ జాకీ చాన్. కానీ ప్రభాస్ నో చెప్పారట.ఇక అందుకు కారణం డేట్స్ ఇష్యూ అని తెలిపారు కృష్ణంరాజు.అయితే `బాహుబలి` మొదటి భాగం రిలీజ్ అయ్యింది.
ఇకపోతే `బాహుబలి 2` చేయాల్సి ఉంది. ప్రభాస్ డేట్స్ అన్ని రేండేళ్ల వరకు రాజమౌళి లాక్ చేశాడు. అయితే దీనికితోడు అదే సమయంలో సుజిత్‌తో `సాహో` సినిమాకి కమిట్ అయ్యాడు ప్రభాస్.ఇక ఆల్మోస్ట్ మూడేళ్ల వరకు ప్రభాస్ డేట్స్ లేవు. కాగా మధ్యలో వెళితే `బాహుబలి 2` షూటింగ్ డిస్టర్బ్ అవుతుంది.అంతేకాదు లుక్స్ అన్నీ పోతాయి. మళ్లీ చాలా టైమ్ పడుతుంది.ఇక దీంతో నిర్మొహమాటంగా జాకీ చాన్ ఆఫర్‌ని తిరస్కరించారట ప్రభాస్.అయితే కృష్ణంరాజు ఓ టీవీ ఇంటర్వ్యూలో చాలా రోజుల క్రితం ఈ విషయాన్ని తెలిపారు.ఇదిలావుంటే తాజాగా ఆ ఇంటర్వ్యూలోని ఈ క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అభిమానులు దాన్ని షేర్ చేస్తూ రచ్చ చేస్తున్నారు.ఇక అప్పుడే ఆ సినిమా చేసి ఉంటే ఇప్పుడు ప్రభాస్ రేంజ్ వేరేలా ఉండేదని కొందరు అంటుంటే, ఇండియన్ సినిమాలతోనే, తెలుగు సినిమాలతోనే గ్లోబల్ స్టార్‌గా ప్రభాస్ ఎదగడం ఖాయమని మరికొందరు అభిమానులు అంటున్నారు. అయితే మొత్తానికి ఈ వార్త అభిమానులను ఖుషీ చేస్తుందని చెప్పొచ్చు..!!