టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన మూడో చిత్రం 'అఖండ' ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ మూవీతో బాలయ్య- బోయపాటి హ్యాట్రిక్ కొట్టేశారు. ఇక 2021 చివర్లో అదీ టికెట్ రేట్లు చాలా తక్కువగా ఉన్న టైంలో రిలీజ్ అయిన ఈ మూవీ బాలయ్య కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్స్ ను సాధించి రికార్డు క్రియేట్ చేసింది. అయితే ఒకవేళ టికెట్ రేట్లు ఇప్పటిలా ఉండి ఉంటే..సినిమా కచ్చితంగా రూ.100 కోట్లకు పైగా షేర్ ను కలెక్ట్ చేసి ఉండేది అనడంలో సందేహం లేదు.
ఇక ఈ చిత్రంలో బాలకృష్ణ.. డబుల్ రోల్ లో కనిపించారు.అయితే ఒక పాత్రలో సోషల్ యాక్టివిటీస్ లో పాల్గొనే మురళీకృష్ణ గా, మరో పాత్రలో దుర్మార్గులను చీల్చి చెండాడే అఘోర గా విశ్వరూపం చూపించారు. ఇక అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమాని హిందీలో ఎందుకు రిలీజ్ చేయలేదు అనే ప్రశ్న అభిమానుల్లో ఎక్కువగా ఉంది.ఇక ఎందుకంటే.. ఈ కథలో యూనివర్సల్ అప్పీల్ ఉంది.ఇకపోతే ప్రకృతిని, జనాలను కాపాడుకోవాలని ఒక బాలయ్య చెప్తే .. దేవాలయాలను కాపాడుకోవాలని ఇంకో బాలయ్య చెప్పాడు. అయితే కాబట్టి ఈ కథ హిందీ ప్రేక్షకులకు కూడా నచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇక అలాంటప్పుడు ఈ సినిమాని హిందీలో ఎందుకు రిలీజ్ చేయలేదు అని అభిమానులు చర్చించుకున్నారు. కాగా ఇదే విషయాన్ని నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డితో ప్రశ్నిస్తే.. 'అఖండ' హిందీ డబ్బింగ్, శాటిలైట్…రైట్స్ కు అనుకున్నదానికంటే ఎక్కువ రేటు పలికిందట.అయితే కానీ ఈ సినిమాని అక్కడి థియేటర్లలో రిలీజ్ చేస్తే.. అంత రేటు చెల్లించలేమని.. డబ్బింగ్ రైట్స్, శాటిలైట్ రైట్స్ కొనుగోలు చేసే సంస్థ చెప్పడంతో.. హిందీలో థియేట్రికల్ రిలీజ్ ను స్కిప్ చేసినట్లు ఆయన తెలియజేశారు.అంతేకాదు ఒకవేళ హిందీలో కూడా థియేట్రికల్ రిలీజ్ చేసి ఉంటే.. ఇంకో రూ.50 కోట్లు కలెక్ట్ చేసేదని.. అభిమానులు భావిస్తున్నారు.ఇక ఫైనల్ గా ఏది జరగాలని రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది కదా..!