మాటివిలో ప్రసరమయ్యే బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే సాధారణంగా బిగ్ బాస్ షో తెలుగులో ఎప్పుడు ప్రసారం అయినా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఈ సారి మాత్రం దీనిపై ప్రేక్షకులు మక్కువ చూపించడం లేదు. ఇక ఫలితంగా ఈ సీజన్ నిరాశాజనకంగానే మొదలైంది. అయితే, ఇప్పుడు చివరి దశకు చేరడం.. కొత్త కొత్త టాస్కులు ఇవ్వడంతో ఇది రంజుగా సాగుతోంది.ఇక ఫలితంగా ప్రేక్షకులకు మజాను అందిస్తూ సాగుతోంది.అయితే గతంలో మాదిరిగానే ఆరో సీజన్‌లో కూడా నామినేషన్స్ టాస్కులు గొడవలతో సాగుతున్నాయి. ఈ క్రమంలోనే 13వ వారంలో కూడా రచ్చ రచ్చగా జరిగింది.
ఇక, ఇందులో రేవంత్, ఆది రెడ్డి, కీర్తి భట్, జబర్ధస్త్ ఫైమా, రోహిత్ సాహ్నీ, శ్రీ సత్యలు నామినేట్ అయ్యారు. ఈ వారం కెప్టెన్ అయిన కారణంగా ఇనాయా సుల్తానా.. ఓట్లు పడని కారణంగా శ్రీహాన్ చోటూ తప్పించుకున్నారు.కాగా బిగ్ బాస్ షోలో ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరన్నది ఊహించినట్లుగానే ఉండేది. ఆరో సీజన్‌లో మాత్రం ఈ పరిస్థితి కనిపించడం లేదు.ఇక దీనికి కారణం ఇప్పటికే ఎంతో మంది స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవడమే.అయితే ప్రతివారం ఓటింగ్‌లో ఇలాంటి ట్విస్టులు కనిపిస్తున్నాయి.కాగా ఈ క్రమంలోనే పదమూడో వారంలో కూడా ఓటింగ్ సరళి ఎంతో భిన్నంగా సాగుతోందని టాక్.
ఇకపోతే ఆరో సీజన్‌లో రికార్డు స్థాయిలో 21 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు.అందులో సింగర్ రేవంత్ మాత్రమే టైటిల్ ఫేవరెట్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇక హౌస్‌లో అతడి ప్రవర్తన ఎలా ఉన్నా ఓటింగ్ మాత్రం భారీగానే జరుగుతోంది.అయితే ఫలితంగా నామినేషన్స్‌లో ఉన్న ప్రతి వారం ఎక్కువ ఓట్లు సాధిస్తున్నాడు.ఇక ఇప్పుడు 13వ వారం కూడా అతడే టాప్ ప్లేస్‌లో ఉన్నాడని తెలుస్తోంది.అయితే బిగ్ బాస్ ఆరో సీజన్ పదమూడో వారానికి జరుగుతున్న ఓటింగ్‌లో మొదటి నుంచీ సింగర్ రేవంత్ మొదటి స్థానంలోనే ఉన్నాడు.ఇక అతడి తర్వాత అంటే రెండో స్థానంలో చాలా మంచోడుగా పేరు తెచ్చుకున్న రోహిత్ సాహ్నీ కొనసాగుతున్నట్లు తెలిసింది.మూడో స్థానంలో కీర్తి భట్, నాలుగో స్థానంలో శ్రీ సత్య, ఐదో స్థానంలో ఆది రెడ్డి, ఆరో స్థానంలో ఫైమాలు ఉన్నారని సమాచారం.అయితే బిగ్ బాస్ ఆరో సీజన్ పదమూడో వారానికి సంబంధించి డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి. టాప్ 2లో ఉన్న రేవంత్, రోహిత్ తప్ప మిగిలిన వాళ్లంతా డేంజర్ జోన్‌లోనే ఉన్నారని తెలుస్తోంది.ఇక ఇందులో కీర్తికి, శ్రీ సత్యకు ఎక్కువ ఓట్లు పడుతుండడంతో అది రెడ్డి, ఫైమా చివర్లో ఉన్నారు.అయితే ఇది బిగ్ బాస్ కాబట్టి ఈ నలుగురిలో ఇద్దరు వెళ్లే చాన్స్ ఉంది..!!