బిగ్ బాస్ సీజన్ 6లో అందరిని ఆకట్టుకున్న గలాటా గీతూ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అయితే ప్రేక్షకులకు కాస్త ఇరిటేషన్ తెప్పించినా.. ఈ రోజు ఏం చేస్తుందో అంటూ ఆసక్తితో చూశారు ప్రేక్షకులు. ఇక అలా గీతూ కావాల్సినంత ఫుట్టేజ్ ఇచ్చింది. ఇకపోతే బిగ్ బాస్ చెప్పింది కూడా పట్టించుకోకుండా నా స్ట్రాటజీ, నా గేమ్, నా ఇష్టం అంటూ ఆడింది గీతూ.. ఇక ఈ చిన్నది ఎలిమినేట్ అయిన తర్వాత బోరున ఏడ్చింది. హౌస్ లో ఉన్నప్పుడు నన్ను ఏడిపించు బిగ్ బాస్ అని సవాల్ విసిరిన గీతూ.. అయితే ఇప్పుడు బిగ్ బాస్ ఎపిసోడ్స్ చూస్తూ రోజు ఏడుస్తోంది.
అంతే కాదు ఇక ఆ వీడియోలు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి. ఇకపోతే కప్పు కొట్టేది నేనే గెలిచేది నేనే అని బీరాలు పోయిన గీతూ టాప్ 5లో అయినా ఉంటుందని అంతా అనుకున్నారు కానీ ప్రేక్షకులు ఆమె ఎలిమినేట్ చేశారు.అయితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంతవరకు ఇంటర్వ్యూ ల్లో కనిపించని గీతూ చాలా రోజుల తర్వాత బయటకు వచ్చింది. బిగ్ బాస్ తర్వాత డిప్రషన్ లో కి వెళ్లిందట..ఇక అందుకే బయట కనిపించలేదట.. మొన్నీమద్యే నాగార్జునను కలిసింది గీతూ.. ఇక అక్కడ దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఇకపోతే బయటకు వచ్చిన గీతూ చేసిన పని ఏంటో తెలుసా.. చిత్తూరు చిరుత అని చెప్పుకున్న గీతూ తాజాగా చిరుత ట్యాటూ వేయించుకుంది. అయితే ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన గీతూ.. 20 రోజుల తరువాత బయటకు వచ్చాను. ఇక ఓ పని మీద బయటకు వచ్చాను.. అది ఎక్కడికి అంటే.. హెయిర్ కలర్ కోసం.. కాలిపై టాటూ కోసం. అంతేకాదు నా లైఫ్‌లో చేయని పనులు చేస్తున్నా.. ఇక నా కాలికి సైలెన్సర్ కాలిన మచ్చ ఉంది.. ఆ మచ్చని.. చిరుత మచ్చలతో కవర్ చేద్దాం అని ఈ చిరుత చారలు టాటూగా వేయించుకున్నాను' అంటూ చెప్పుకొచ్చింది...!