శైలేష్ కొలను దర్శకత్వంలో తాజాగా హిట్ ది సెకండ్ కేస్ అనే
మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ లో టాలెంటెడ్ నటుడు అడవి శేషు
హీరో గా నటించగా , మీనాక్షి
చౌదరి హీరోయిన్ గా నటించింది. నాచురల్ స్టార్
నాని ఈ
మూవీ ని నిర్మించాడు. ఈ
మూవీ ని రేపు అనగా
డిసెంబర్ 2 వ తేదీన
థియేటర్ లలో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ
మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ
మూవీ నుండి ఈ
సినిమా యూనిట్ కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ
మూవీ యూనిట్ ఈ
సినిమా నుండి ఒక ట్రైలర్ ను విడుదల చేసింది. ఆ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.
మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ ట్రైలర్ లో అడవి శేషు ఒక కిల్లర్ గురించి వెతుకుతూ ఉంటాడు.
అయితే తాజాగా ఈ
మూవీ యూనిట్ హిట్ ది సెకండ్ కేస్
మూవీ లో కిల్లర్ ఎవరు అనే విషయాన్ని ఈ రోజు సాయంత్రం 6 గంటల 03 నిమిషాలకు తెలియజేస్తాము అంటూ అధికారికంగా ప్రకటిస్తూ ఒక
పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ
మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ
పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే హిట్ ది ఫస్ట్ కేస్
మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో తెలుగు సినీ ప్రేమికులు హిట్ ది సెకండ్ కేస్
మూవీ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ
మూవీ ఏ రేంజ్
బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటుందో ఏ రేంజ్ కలెక్షన్ లను సాధిస్తుందో తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే.