పూనమ్ కౌర్ కూడా ఆ వ్యాధి బారిన పడిందా?

Satvika
పూనమ్ కౌర్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. కొన్ని సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకుల కు పరిచయం అయ్యింది. గత కొంత కాలంగా సినిమాల కు దూరంగా ఉన్న ఈ అమ్మడు మాత్రం సోషల్ మీడియా లో మాత్రం యాక్టివ్ గా వుంటుంది. ఇకపోతే మయోసైటిస్‌ అనే అరుదైన జబ్బుతో బాధపడుతున్నట్లు ప్రముఖ నటి సమంత ప్రకటించి అందరినీ ఆశ్చర్యాని కి గురిచేసిన సంగతి తెలిసిందే. ఆతర్వాత కల్పికా గణేష్‌ కూడా ఇదే సమస్యతో సతమతమవుతున్నట్లు తెలిపింది.

తాజాగా ప్రముఖ నటి పూనమ్‌ కౌర్‌ తన అభిమానులకు ఓ షాకింగ్‌ విషయం చెప్పింది. చేసింది కొన్ని సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఫైబ్రో మైయాల్జియా అనే ఓ అరుదైన జబ్బుతో బాధపడుతోందట. సుమారు రెండేళ్లుగా ఈ సమస్యతో సతమతమవుతోన్న పూనమ్ ప్రస్తుతం దీనిక కోసం కేరళలో చికిత్స తీసుకుంటోందట. తాజాగా తన ట్రీట్‌మెంట్‌ కు సంబంధించి న ఫోటోలు కొన్ని సామాజిక మాధ్యమా ల్లో వైరల్ అవుతున్నాయి...

తన అందం, అభినయం తో టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది పూనమ్‌ కౌర్‌. ఎస్వీ కృష్ణారెడ్డి, శ్రీకాంత్‌ కాంబినేషన్‌ లో వచ్చిన మాయాజాలం తో ఎంట్రీ ఇచ్చిన ఈ సొగసరి ఒక విచిత్రం, నిక్కి అండ్ నీరజ్, గగనం, శ్రీనివాస కళ్యాణం, నెక్స్ట్ ఏంటి?, ఈనాడు, గణేష్, నాగవల్లి, పయనం, గమనం తదితర లతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. ప్రస్తుతం అడపాదడపా మాత్రమే లు చేస్తోంది. అయితే సోషల్‌ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటోంది. సామాజిక సమస్యల పై తనదైన శైలి లో స్పందిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల కాంగ్రెస్‌ నేనత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రలో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచింది.. ఇప్పుడు ఈ పోస్ట్ తో మరోసారి వైరల్ అవుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: