ప్రతిష్టాత్మక అవార్డు సాధించిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్...!!
ఐతే అమెరికా లోని న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్(NYFCC) ఆర్‌ఆర్‌ఆర్ మూవీ కు గానూ ఉత్తమ దర్శకుడిగా రాజమౌళిని గుర్తించింది. దింతో ఈ అవార్డు ను కైవసం చేసుకున్న మొదటి భారతీయ దర్శకుడిగా రాజమౌళి గారు న్యూ రికార్డు సృష్టించాడు. ఇంగ్లీష్ మూవీ లతో పోటీ పడి ఒక టాలీవుడ్ సినిమా ఇంత గొప్ప ఘన విజయం సాధించింది అంటే రాజమౌళి గారి గొప్పతనం గూర్చి చెప్పాల్సింది ఏం లేదు అని తెలుస్తుంది.ఐతే దీంట్లో భాగంగానే ఇటీవలే లాస్ ఏంజిల్స్ టైమ్స్ అనే ఇంగ్లీష్ న్యూస్ పేపర్ రాజమౌళి గురించి ఫ్రంట్ పేజ్‌లో ఓ పెద్ద ఆర్టికల్ ప్రచురించింది.
ఐతే ఆర్ఆర్ఆర్ మూవీ అనేది ఇండియన్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ లో తారక్ కొమురం భీమ్ క్యారెక్టర్ లో నటించగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ లో నటించాడు. బాలీవుడ్ స్టార్ హీరో ఐనా అజయ్ దేవగన్ ఇందులో ఒక కీలకపాత్రను చేసాడు.దీన్ని డివివి దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ మూవీ లో అలియాభట్, ఒలీవియా మొర్రీస్‌లు హీరోయిన్స్ గా చేసారు. ఎన్నో అవంతరాలు దాటి వచ్చిన ఈ మూవీ ఫిబ్రవరి 25న రిలీజ్ ఐ సంచలనం విజయన్ని కైవసం చేసుకుంది. మొత్తం మీద ఈ మూవీ 1200కోట్లకు పైగా వసూళ్లు సాధించి రాజమౌళికి కంటిన్యూ గా రెండోసారి కూడా 1000 కోట్ల మూవీ క్లబ్‌లో నిలిచిన చిత్రంగా రికార్డు సృష్టించింది.
ఏది ఏమైనా ఇలాంటి మరిన్ని మూవీస్ రాజమౌళి గారు చేసి మన టాలీవుడ్ ఇండస్ట్రీ ఖ్యాతి ని పెంచాలని కోరుకుందాం అలాగే ఈ సంవత్సరం ఆస్కార్ సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్న అభిమానులు..