టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళితో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే వీరి కాంబినేషన్ లో సినిమా కోసం మహేష్ అభిమానులు అయితే ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇందుకుగాను మహేష్ ఫ్యాన్స్ కోరిక త్వరలోనే తీరుతుంది ఇప్పటికే ఈ విషయాన్ని రాజమౌళి ప్రకటించడం జరిగింది. అంతేకాదు ఈ సినిమా కోసం పనులు కూడా ప్రారంభించారు చిత్ర యూనిట్ .ఈ మేరకు టాప్ హాలీవుడ్ స్టూడియోస్ తో టైప్ అప్ కాబోతున్నట్లుగా సమాచారం అందుతుంది .అయితే ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయడం కోసం ఇతర దేశాల్లో షూటింగ్ లొకేషన్స్ కోసం హాలీవుడ్ స్టూడియో తో కలవనునట్టు తెలుస్తోంది.
దీనికిగాను చర్చలు కూడా జరుగుతున్నాయట. అయితే అన్నీ అనుకున్నట్లు జరిగితే గనక ఆ స్టూడియో వారు ఈ సినిమాని ప్రెసెంట్ చేయడంతో పాటు డిస్ట్రిబ్యూషన్ సపోర్ట్ కూడా చేస్తారట ఇక దీనికిగాను మొట్టమొదటిసారి మహేష్ సినిమాకు హాలీవుడ్ సంస్థ కలవడంతో మహేష్ ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు .దీనికి సంబంధించి అది ఏ సంస్థ అనేది ఇంకా తెలియదు. అయితే కొందరు మాత్రం సోనీ లేదా డిస్నీ ఉండే అవకాశం ఉంటుందని అంటున్నారు. మహేష్ రాజమౌళితో పనిచేయాలని కల నెరవేరుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు.
దీనికి గాను మహేష్ బాబు రాజమౌళి గారితో పనిచేయడం అనేది నా కల రాజమౌళితో సినిమా చేయడం అంటేనే ఒకేసారి 25 సినిమాలు చేయడం శారీరకంగా కాస్త ఎక్కువ డిమాండ్ చేసే మూవీ.. నేను చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను అంతే కాదు ఇది పాన్ ఇండియా సినిమా త్వరలోనే మా సినిమాను అందిస్తామని మహేష్ బాబు పేర్కొనడం కూడా జరిగింది. వీరిద్దరి కాంబినేషన్లో ఉన్న ఈ సినిమా అడ్వెంచరుగా రానుంది .ఆఫ్రికా అడవి నేపథ్యంలో ఈ సినిమా కథ మొత్తం కొనసాగుతుంది .అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ మొత్తం కూడా ఆఫ్రికన్ అడవుల్లో జరగని ఉందని తెలుస్తోంది..!!