తమిళ
సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరు అయినటు వంటి తలపతి
విజయ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
విజయ్ ఇప్పటికే ఈ సంవత్సరం బీస్ట్ అనే పాన్
ఇండియా మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు . ప్రస్తుతం వరిసు అనే
మూవీ లో తలపతి
విజయ్ హీరో గా నటిస్తున్నాడు.
వంశీ పైడిపల్లి దర్శకత్వం లో తేరకేకుతున్న ఈ
మూవీ ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు .
రష్మిక మందన ఈ
మూవీ లో
హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,
తమన్ ఈ
మూవీ కి సంగీతం అందిస్తున్నాడు . ఈ
మూవీ ని వచ్చే సంవత్సరం
జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నారు . ఈ
మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ
సినిమా నుండి రెండు పాటలను ఈ
మూవీ యూనిట్ విడుదల చేసింది.
ఈ రెండు పాటలకు కూడా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది. వరసు
మూవీ ని తెలుగు లో వారసుడు పేరుతో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే వరిసు
మూవీ విడుదల కాక ముందే తలపతి
విజయ్ తన తదుపరి
మూవీ ని ప్రారంభించాడు. తలపతి
విజయ్ తన తదుపరి
మూవీ ని
లోకేష్ కనకరాజు దర్శకత్వం లో చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ తలపతి
విజయ్ కెరియర్ లో 67 వ
మూవీ గా రూపొందబోతుంది. ఈ
మూవీ పూజా కార్యక్రమాలతో ఈ రోజు ప్రారంభం అయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం
డిసెంబర్ 6 వ తేదీన ఈ
మూవీ కి సంబంధించిన ఫోటో షూట్ ను చిత్ర బృందం నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది.