విజయ్ 67 సినిమాలో పాన్ ఇండియా హీరోయిన్ ఫిక్స్..!
ఇప్పటికే లోకేష్ కనగరాజు తెరకెక్కించిన విక్రమ్ సినిమాలో కార్తీక్ ఖైదీ సినిమాను చూపించిన విషయం తెలిసిందే. ఇక సూర్యతోపాటు విజయ్ దళపతి కూడా నటించారు. సూర్య రోలెక్స్ పాత్రలో విక్రమ్ కు వ్యతిరేకంగా కనిపించిన విషయం మనకు తెలిసిందే. అయితే. ఇప్పుడు విక్రమ్ వర్సెస్ రోలెక్స్ గా కొనసాగింపుతో విజయ్ దళపతి 67 సినిమాను తెరకేక్కించబోతున్నారు. ఈ సినిమా క్లైమాక్స్ లో వీరిద్దరిని ప్రత్యేకంగా చూపించబోతున్నట్లు స్పష్టం చేశారు లోకేష్. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో హీరోయిన్ గా పాన్ ఇండియా హీరోయిన్ త్రిష గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.. ఆమెకు కథ వినిపించగా తాను కూడా ఈ సినిమా చేయడానికి ఒప్పుకొందట. ఈ విషయం తెలిసి అభిమానులు సందడి చేస్తున్నారు.
ఇకపోతే ఇండస్ట్రీకి వచ్చి దాదాపుగా 15 సంవత్సరాల కు పైగా అవుతున్నా.. ఈ స్టార్ హీరోయిన్ రేంజ్ ఎక్కడ తగ్గడం లేదని చెప్పాలి. మొన్నటి వరకు అడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చిన త్రిష మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో నటించి పాన్ ఇండియా హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత ఈమెకు తెలుగులో కూడా ఆఫర్లు వస్తున్నాయి. ఏది ఏమైనా ఈ వయసులో కూడా మరింతగా దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ.