కనెక్ట్ మూవీ తెలుగు విడుదల డేట్ లాక్..!
ఇకపోతే సోమవారం తెలుగు టీజర్ ను రిలీజ్ చేయగా ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హారర్ అంశాలతో భయపడుతూ సాగే ఈ టీజర్ లో సత్యరాజ్, అనుపమ్ ఖేర్ మాత్రమే కనిపించారు. అయితే నయనతారను చూపించలేదు. అవుట్ అండ్ అవుట్ హారర్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ 22న రిలీజ్ కానుంది. లాక్ డౌన్ టైం లో సాగే కథ ఇది అని సమాచారం. అయితే ఇందులో తల్లి పాత్రలో నయనతార మనకు కనిపించబోతున్నారు.సినీ చరిత్రలోనే మొదటిసారి బ్రేక్ లేకుండా ఈ సినిమాను ప్రయోగాత్మకంగా తెరకెక్కించబోతున్నారు.
ఇంటర్వెల్ బ్రేక్ లేకుండా కనెక్ట్ సినిమాను 99 నిమిషాల నిడివి తో రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కలెక్ట్ సినిమాను తమిళంలో నయనతార భర్త దర్శకుడు విగ్నేష్ శివన్ రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించారు. ఈ సినిమాతో లాంగ్ గ్యాప్ తర్వాత అనుపమ్ ఖేర్ కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే కార్తికేయ 2 సినిమాతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చిన అనుపమ్ ఖేర్ ఇప్పుడు తమిళ్ లో కనెక్ట్ మూవీ తో రీ ఎంట్రీ ఇస్తూ ఉండడంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా ఇప్పటికే నయనతార తో అశ్విన్ శరవణన్ మాయ సినిమాను చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా కమర్షియల్ గా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మరోసారి వీరి కాంబినేషన్లో రాబోతున్న ఈ హారర్ చిత్రం ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.