మొన్నటి వరకు తన ఖాతాలో ఒక్క ఫ్లాప్ కూడా లేని డైరెక్టర్ ఆచార్య సినిమాతో బిగ్గెస్ట్ డిజాస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ. అయితే ముఖ్యంగా మెగాస్టార్ లాంటి ఓ లెజెండ్ హీరో రామ్ చరణ్ లాంటి హీరోలతో ఈ సినిమా తీసి కూడా ఫ్లాప్ ని తెచ్చుకోవడం కొరటాల కెరియర్ కు పెద్ద డిజాస్టర్ గా మారింది .ఈ క్రమంలోనే కొరటాల ఎన్టీఆర్ తో సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. కానీ దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ కూడా లేదు. త్వరలోనే ఈ సినిమా కి వెళ్తుందని షూటింగ్ లాంచనంగా ప్రారంభించానున్నారని
సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇలాంటి క్రమంలోనే ఎన్టీఆర్ అభిమానులకు ఒక మంచి గుడ్ న్యూస్ సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారుతుంది. అయితే ఇప్పటికే ఎన్టీఆర్ 30 సినిమాల్లో రష్మిక మందన మృనాళ్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఇదే క్రమంలో ఈ సినిమాలో మరో కీలక పాత్రలో లక్కీ హీరోయిన్ నిత్యమీనన్ ని తీసుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి .గతంలో జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ తో కలిసి నటించిన నిత్యామీనన్ పై తారక్ ఓ రేంజ్ లో పొగిడారు..
ఎన్టీఆర్ కి మరో అవకాశం వస్తే తప్పకుండా నిత్యమీనన్ తో నటించాలని ఉంది అంటూ గతంలో చాలా సార్లు చెప్పుకొచ్చారు .ఇప్పుడు ఎన్టీఆర్ కోరిక తీరింది అని చెప్పాలి .అయితే ఎన్టీఆర్ ఈ సినిమాలోని ఒక కీలక పాత్ర కోసం నిత్యమీనన్ ను కలిశారని ఇక ఎన్టీఆర్ తో సినిమా అనేసరికి నిత్యమీనన్ కూడా ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో నిత్యమీనన్ కెరియర్ పరంగా చాలా ఆలోచించి అడుగులు వేస్తోంది. సినిమాలో హీరోయిన్ గా నే కాకుండా తనకు నచ్చిన క్యారెక్టర్ లను చేస్తూ పోతుంది ఈ అమ్మడు .ఇక దీంతో ఎన్టీఆర్ మరియు నిత్యమీనన్ మరోసారి జతకట్టనున్నారని తెలుసుకున్న వీరి అభిమానులు ఆనందపడుతున్నారు..!!