బాలయ్య సీజన్ 2 లో సందడి చేయనున్న సీనియర్ స్టార్ హీరోయిన్స్ వీళ్ళే..!

Divya
నందమూరి బాలకృష్ణ ఒకవైపు సినిమాలలో మరొకవైపు రాజకీయాలలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.  అయితే ఇప్పుడు ఆరు పదుల వయసులో కూడా వరుస మాస్,  యాక్షన్ చిత్రాలు తెరకెక్కిస్తూ.. ఇటీవల బుల్లితెర షోలలో కూడా అడుగుపెట్టాడు.  మొన్నటి వరకు ఎటువంటి ప్రకటనలకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేయని బాలయ్య.. ప్రస్తుతం ఆహా ఓటీటీ లో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షో కి హోస్టుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే మొదటి సీజన్ పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం ఇప్పుడు రెండవ సీజన్ కూడా ప్రారంభమైంది.  అయితే గతంలో ఊహించని విధంగా ఇప్పుడు ఈ సీజన్ 2 కి సినీ సెలబ్రిటీలు మాత్రమే కాదు రాజకీయ నాయకులు కూడా వచ్చి మరింత వేడి పుట్టిస్తున్నారు.

రాజకీయాలకు సంబంధించిన ఎన్నో విషయాలను రివీల్ చేస్తూ.. ఉత్కంఠ భరితంగా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటికే సీజన్ 2 కి మొదటి ఎపిసోడ్లో భాగంగా నారా చంద్రబాబునాయుడు తో పాటు ఆయన తనయుడు నారా లోకేష్ హాజరైన విషయం తెలిసిందే.  ఆ తర్వాత యంగ్ హీరోలు విశ్వక్ సేన్ , సిద్దు జొన్నలగడ్డ, అడవి శేష్,  శర్వానంద్ వంటి యంగ్ హీరోలు వచ్చి సందడి చేయగా.. ఆ తర్వాత రాధిక, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి వచ్చి ఎన్నో విషయాలను పంచుకున్నారు.  ఆ తర్వాత ఎపిసోడ్ లో భాగంగా దర్శకులు రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి తో పాటు స్టార్ ప్రొడ్యూసర్లు అల్లు అరవింద్ తో పాటు సురేష్ బాబు వచ్చి సందడి చేసిన విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే 6వ ఎపిసోడ్ కి ఎవరు హాజరు కాబోతున్నారు అనే ఉత్కంఠ కూడా నెలకొంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సీజన్ 2 6వ ఎపిసోడ్లో భాగంగా సీనియర్ స్టార్ హీరోయిన్ లైన జయసుధ మరియు జయప్రధ రాబోతున్నారు.  ఈ ఎపిసోడ్ కి సంబంధించి షూటింగ్ కూడా ఈరోజు అలాగే ఈ నెల 11వ తేదీన జరగనున్నట్లు సమాచారం. మరి ఈ ఎపిసోడ్ ఏ రేంజ్ లో టిఆర్పి రేటింగ్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: