ప్రస్తుతం
పవర్ స్టార్ పవన్
కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలు మరోవైపు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెడుతూ బిజీగా ఉన్నాడు. అయితే ప్రస్తుతం పవన్
కళ్యాణ్ చేతిలో మూడు నుండి నాలుగు సినిమాలు ఉన్నాయి .అందులో హరిహర వీరమల్లు ఒకటి కాగా క్రిష్ దర్శకత్వం వహిస్తున్న .. ఈ
సినిమా పట్టాలెక్కి చాలా కాలం అవుతున్నప్పటికీ ఈ
మూవీ షూటింగ్ త్వర త్వరగా పూర్తి చేసే పనిలో పడ్డారు పవన్ కళ్యాణ్. మరోవైపు
హరి శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్
సినిమా చేసేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. పవన్
కళ్యాణ్ రీమిమేక్ చేయబోతున్నాడని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నా సంగతి తెలిసిందే.
అయితే ఈ ప్రాజెక్ట్ పూర్తి కాకముందే పవన్
కళ్యాణ్ సాహు
డైరెక్టర్ సుజిత్ తో ఓ సినిమాని అనౌన్స్ చేయడం జరిగింది .అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మించడం జరుగుతుందట. ఇటీవల ఆఫీసియల్ గా దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఒక పోస్టర్ను కూడా తాజాగా విడుదల చేయడం జరిగింది ఈ కాన్సెప్ట్
పోస్టర్ బట్టి చూస్తుంటే
సుజిత్ తెరకెక్కించబోయే ఈ సినిమాలో పవన్
కళ్యాణ్ గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది అంతేకాదు
జపాన్ ముంబై నేపథ్యంలో ఈ
సినిమా కథ కొనసాగే అవకాశం ఉందని వార్తలువస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఇక ఇప్పుడు ఈ సినిమాకు
పవర్ స్టార్ పవన్
కళ్యాణ్ అందుకున్న రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ గా మారింది .అయితే
నిర్మాత దానయ్య ఈ చిత్రానికి 170 కోట్ల బడ్జెట్ను పెట్టబోతున్నాడని తెలుస్తోంది .అయితే అందులో 70 కోట్లు పవన్
కళ్యాణ్ రెమ్యూనరేషన్ అని వార్తలు వినిపిస్తున్నాయి. పవన్
కళ్యాణ్ కు 70 కోట్ల రూపాయల పారితోషకం ఇచ్చేందుకు దానయ్య సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఇప్పటికే 25 కోట్లు అడ్వాన్స్ కూడా ఇవ్వడం జరిగింది.పాన్
ఇండియా ఇమేజ్ లేని పవన్
కళ్యాణ్ ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకోవడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ
సినిమా వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో
హీరోయిన్ ఎవరు మ్యూజిక్
డైరెక్టర్ ఎవరు? అనేది క్లారిటీ రావాల్సి ఉంది...!!