అజిత్ తునివు తెలుగు రైట్స్ ఎన్ని కోట్లు అంటే..?
అయితే ఈ సినిమాను తెలుగులో తెగింపు పేరుతో రిలీజ్ చేయడానికి సన్నహాలు సిద్ధం చేస్తున్నారు.. ఇప్పటికే సంక్రాంతి బరిలో టాలీవుడ్ స్టార్ హీరోలైన చిరంజీవి తన సినిమా వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ తన సినిమా వీరసింహారెడ్డి సినిమాలను రిలీజ్ చేయడంతో పాటు కోలీవుడ్ విజయ్ దళపతి సినిమా వారసుడు కూడా ఉండడంతో ఇప్పుడు తునివు మూవీ రూ.6 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తేనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను రీచ్ అయ్యి డిస్ట్రిబ్యూటర్లకు లాభాల పంట పండిస్తుంది. లేకపోతే మరింత నష్టపోయే అవకాశం కూడా కనిపిస్తోంది.
ఇప్పటికే ఎన్నో బ్లాక్బస్టర్ విజయాలను అందుకొని తమిళ సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న అజిత్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వాలి , ప్రియురాలు పిలిచింది లాంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైన ఈయన ఇప్పుడు తునివు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాని తెలుగు ,తమిళ్ భాషలలో రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. మరి జనవరి 11వ తేదీన రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.