సంక్రాంతి బరిలో మరో యంగ్ హీరో చిత్రం.. తట్టుకోగలరా..?

Divya
సంక్రాంతి బరిలో ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలతో పాటు కోలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు థియేటర్ల వద్ద పోటీ పడుతున్న విషయం తెలిసిందే. మన తెలుగు సినిమాల విషయానికి వస్తే చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలు పోటీ పడుతున్నాయి.. విచిత్రం ఏమిటంటే ఈ రెండు సినిమాలను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించడం.. రెండు సినిమాలలో కూడా హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తోంది.. యాదృచ్ఛికంగా ఇలా జరిగినప్పటికీ ఇందులో ఏ ఒక్క సినిమా సక్సెస్ అయిన అటు movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ ఇటు శృతిహాసన్ కి మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది. మరొకవైపు కోలీవుడ్ స్టార్ హీరోలైన అజిత్ తునివు సినిమా, విజయ దళపతి వారిసు సినిమాలు కూడా పోటీ పడుతున్నాయి.
ఇలా ఒకేసారి ఇంతమంది స్టార్ హీరోలు పోటీపడుతున్న నేపథ్యంలో ఏ సినిమా విజయవంతమవుతుందని అందరూ ఆశ్చర్యంగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ నలుగురు స్టార్ హీరోలతో పోటీ పడడానికి యంగ్ హీరో తన సినిమాను రిలీజ్ చేయబోతున్నారట. మంచి రోజులు వచ్చాయి సినిమా ద్వారా ఇటీవల బాగా పాపులారిటీని దక్కించుకున్న సంతోష్ శోభన్ ప్రస్తుతం భారీ నిర్మాణ సంస్థ అయిన యు వి క్రియేషన్స్ లో ఒక చిన్న సినిమా చేస్తున్నారు. మిర్చి,  రన్ రాజా రన్, ఎక్స్ప్రెస్ రాజా, భాగమతి,  సాహో వంటి సినిమాలను తెరకెక్కించిన యువి క్రియేషన్స్ ఇప్పుడు చిన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
మేర్లపాక గాంధీ అసిస్టెంట్ డైరెక్టర్ కార్తీక్ ని.. దర్శకుడిగా పరిచయం చేస్తూ సంతోష్ శోభన్ హీరోగా ఒక చిన్న సినిమా నిర్మిస్తోంది.  ఇప్పుడు అదే హీరో సంతోష్ శోభన్ తోనే మరో సినిమా తీయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం . అనీల్ అనే కొత్త డైరెక్టర్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.  సంతోష్ శోభన్ సరసన సోనియా ఆకుల హీరోయిన్ గా నటించబోతోంది. రాంగోపాల్ వర్మ దిశా సినిమాలో దిశా పాత్ర పోషించింది సోనియా.. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ఇకపోతే కార్తిక్ తో సంతోష్ శోభన్ సినిమా  సంక్రాంతికి విడుదల కాబోతోందని సమాచారం. మరి పెద్ద సినిమాలతో ఈ చిన్న సినిమా పోటీపడి నెగ్గుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: