సెలబ్రెటీలు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా మారారు. ముఖ్యంగా చిన్న హీరోయిన్లు మాత్రం అవకాశాల కోసం మరిన్ని అందాలను బయటపెడుతూ తెగ రచ్చ రచ్చ చేస్తున్నారు.
అయినా కూడా వీరిని దర్శక నిర్మాతలు పట్టించుకోవడం లేదు. కానీ ఓపికగా ఎదురు చూస్తున్నారు కొంతమంది హీరోయిన్స్. అందులో ఫరియా అబ్దుల్లా కూడా ఒకరు.
అనుదీప్ కె.వి దర్శకత్వంలో తెరకెక్కిన జాతిరత్నాలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఫరియా. ఇక ఈ సినిమా థియేటర్లలో విడుదలై సెన్సేషనల్ క్రియేట్ చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఇందులో హీరోయిన్ గా నటించింది ఫరియా అబ్దుల్లా. ఇక ఈ సినిమాలో తొలిసారి నటనతో మంచి గుర్తింపు అయితే సంపాదించుకుంది.
ఇక ఈ సినిమా తర్వాత పలు సినిమాలలో అవకాశాలు అందుకుంది. నాగార్జున నటించిన బంగార్రాజు సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ లో చేసి తన స్టెప్పులతో కుర్రాళ్లను కూడా ఫిదా చేసింది. ఇటీవలే ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు కూడా వచ్చింది. ఇక ప్రస్తుతం మరో సినిమాలో బిజీగా ఉందని తెలిసింది. ఇక ఫరియా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది.
తనకు సంబంధించిన ఫోటోలను, వ్యక్తిగత విషయాలను బాగా పంచుకుంటుంది. సోషల్ మీడియాలో కూడా ఈ ముద్దుగుమ్మకు ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో బాగా ముచ్చట్లు పెడుతుంది. బాగా డాన్సులు చేస్తూ వాటిని కూడా ఎప్పుడూ పంచుకుంటూ ఉంటుంది. ఇక ఈమెను తన అభిమానులు ముద్దుగా చిట్టి అని లేదా పొడుగు కాళ్ల సుందరి అని పిలుస్తుంటారు.
ఎందుకంటే ఈ అమ్మడు ఏకంగా ప్రభాస్ హైట్ నే మించి ఉంటుంది కాబట్టి. ఈమె చూడటానికి చాలా పొడవుగా ఉంటుంది. ఇక ఈమె హైట్ విషయంలో బాగా ట్రోల్స్ కూడా ఆమె ఎదురుకుంది. ఇక ఫోటో షూట్ లంటూ బాగా రచ్చ చేస్తుంది. ప్రాజెక్టులతో పాటు పలు వేడుకల్లో కూడా బాగా బిజీ బిజీగా ఉంటుంది. పైగా షాప్ ఓపెనింగ్స్ లలో కూడా ఈ ముద్దుగుమ్మను బాగా ఆహ్వానిస్తూ ఉంటారు.
అలా అతి తక్కువ సమయంలో మంచి క్రేజ్ సంపాదించుకుంది ఫరియా అబ్దుల్లా. ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ లో కొన్ని ఫోటోలు ఆమె షేర్ చేసుకుంది. అందులో బాగా గ్లామర్ షో చేయటంతో ఆ ఫోటోలకు బాగా లైక్స్, కామెంట్లు వస్తున్నాయి. ఇక అందులో తను షార్ట్ డ్రెస్ వేసుకొని ఫోటోలకు బాగానే ఆమె ఫోజులిచ్చింది.
అందులో తన కాళ్ళ అందాలతో బాగా రెచ్చిపోయినట్లు కనిపించింది. దాంతో ఓ నెటిజన్ ప్యాంట్ కూడా ఉంటే బాగుండు చిట్టి అంటూ సరదాగా కామెంట్ చేయగా ప్రస్తుతం ఆ కామెంట్ బాగా వైరల్ అవుతుంది. ఇక మరి కొంతమంది రకరకాలుగా కామెంట్లు కూడా చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారట.