సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మహేష్ బాబు కెరియర్ లో 28 వ మూవీ గా రూపొందుతుంది. ఈ మూవీ ని సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నాడు. ఈ మూవీ లో ఇద్దరు హీరోయిన్ లు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ లో మెయిన్ హీరోయిన్ గా మూవీ యూనిట్ చాలా రోజుల క్రితమే పూజా హెగ్డే ను ఎంపిక చేసుకుంది. రెండవ హీరోయిన్ గా ఈ మూవీ లో శ్రీ లీల నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి తమన్ సంగీతం అందించబోతున్నాడు. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ యూనిట్ దుబాయ్ లో మూవీ సెట్టింగ్స్ లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి మొదటి షెడ్యూల్ కూడా పూర్తి అయింది. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ రెండవ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఈ మూవీ రెండవ షెడ్యూల్ లో పూజా హెగ్డే కూడా ఈ మూవీ లో జాయిన్ కాబోతున్నట్లు , అందులో భాగంగా మహేష్ బాబు , పూజా హెగ్డే లపై పెళ్లి సన్నివేశాలను చిత్రీకరించ బోతున్నట్లు కొన్ని వార్తలు వచ్చాయి. ఇది ఇలా ఉంటే పూజా హెగ్డే ఇతర మూవీ లతో ఫుల్ బిజీగా ఉండడం వల్ల ఇప్పట్లో ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ కావడం కుదరదు అని తెలుస్తుంది. దానితో పూజా హెగ్డే ను ఈ మూవీ నుండి తప్పించే అవకాశం ఉంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో అవుతుంది .ఈ వార్తలు ఎంత వరకు నిజమో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.