నందమూరి నటసింహ
బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. వచ్చే
సంక్రాంతి కానుకగా ఆయన 17వ
సినిమా వీరసింహారెడ్డి ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి అందరికీ తెలిసిందే. దీని అనంతరం
బాలకృష్ణ తన 108 సినిమాలో
అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయనున్న సంగతి మన అందరికీ తెలిసిందే .అయితే ఈరోజు ఈ
సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టడం జరిగింది. ఈ సమయంలోనే
బాలయ్య అభిమానులు
అనిల్ రావిపూడి పై మండిపడుతున్నారు. అయితే
బాలయ్య 108వ
సినిమా నుండి టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్
పోస్టర్‌ను కూడా విడుదల చేస్తారని అందరూ భావించారు. కానీ చిత్ర యూనిట్
పూజా కార్యక్రమాలు మాత్రమే చేయడం జరిగింది .బాలయ్య 108వ
సినిమా అనౌన్స్ వచ్చేసి చాలా రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటికీ కూడా షూటింగ్ మొదలుపెట్టలేదు. ఈరోజు నుంచి ఈ
సినిమా షూటింగ్ కార్యక్రమాలు మొదలైనప్పటికీ రెగ్యులర్ షూటింగ్‌ను బ్రేక్ లేకుండా శరవేగంగా చేస్తామని దర్శకుడు
అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు. ఇక
బాలయ్య ఈ
సినిమా లో ఆయన పాత్ర అభిమానులకు చాలా నచ్చుతుంది అని నమ్మకంతో ఉన్నారు.
అనిల్ రావిపూడి ఈ సినిమాలో బాలయ్యకు
జంటగా
ప్రియాంక జవాల్కర్ నటిస్తుంది అనే వార్త ఇప్పుడు సోషల్
మీడియా వేదికగా వైరల్ గా మారింది. కానీ
పూజా కార్యక్రమాలలో మాత్రం ఈమె ఎక్కడ కూడా కనిపించలేదు. దీంతో ఈమె కూడా ఈ సినిమాలో నటిస్తుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇక ఈ సినిమాలో
బాలకృష్ణ ఏకంగా 55 సంవత్సరాలు ఉన్న వ్యక్తి పాత్రలో కనిపించడం ఉన్నాడని తెలుస్తుంది దీంతోపాటు ఈ సినిమాలో బాలయ్యకు కూతురిగా
పెళ్లి సందడి
హీరోయిన్ శ్రీల నటిస్తుంది అన్న సంగతి మనందరికీ తెలిసిందే .ఇక ఈ సినిమాతో
బాలకృష్ణ ఎలాంటి కథలు వేసుకుంటాడో చూడాలి..!!