బాలీవుడ్
ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న సింగర్ లలో ఒకరు అయినటు వంటి యో యో
హనీ సింగ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యో యో
హనీ సింగ్ ఇప్పటికే
బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ సాంగ్ లను పాడి అదిరి పోయే రేంజ్ గుర్తింపు ను
బాలీవుడ్ ఇండస్ట్రీ లో దక్కించుకున్నాడు. అలాగే
హనీ సింగ్ తన పాటలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుని ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని కూడా సంపాదించుకున్నాడు.
హనీ సింగ్ కేవలం
సినిమా పాటలను మాత్రమే పాడడం కాకుండా తన సొంతగా కూడా ఎన్నో ఆల్బమ్ లను తయారు చేసి విడుదల కూడా చేశాడు. అందులో కొన్ని పాటలు అద్భుతమైన రేంజ్ లో ప్రేక్షకాదరణ పొందాయి. అలాగే
హనీ సింగ్ ఆల్బమ్ ల లోని కొన్ని పాటలు ఇప్పటికీ కూడా ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ ను తెచ్చుకుంటున్నాయి.
ఇలా సింగర్ గా తన కంటూ సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న యో యో
హనీ సింగ్ కొంత కాలం క్రితమే తన
భార్య షాలిని తల్వార్ తో విడాకులు తీసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. కొంత కాలం క్రితమే తన భార్యతో విడాకులు తీసుకున్న యో యో
హనీ సింగ్ తాజాగా
ఢిల్లీ లో జరిగిన ఓ
ఈవెంట్ లో తన ప్రియురాలు అయినటు వంటి టీనా తాడనిని పరిచయం చేశాడు. తన జీవితం లోకి టీనా తాడని వచ్చాక చాలా ఆనందంగా మరియు
రొమాంటిక్ గా ఉన్నట్లు యోయో
హనీ సింగ్ చెప్పుకొచ్చాడు. అలాగే తన కొత్త ఆల్బమ్ లో అన్ని తనకు డెడికేట్ చేస్తున్నట్లు యో యో
హనీ సింగ్ తాజాగా వెల్లడించాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కూడా యో యో
హనీ సింగ్ బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న సింగర్ గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు.