బ్యాన్: రష్మిక అబద్ధం చెప్పిందా.. క్లారిటీ ఇచ్చిన కన్నడ సంస్థలు..!

Divya
గత కొద్ది రోజుల నుంచి రష్మిక ప్రవర్తన కన్నడ ఇండస్ట్రీలోని కొన్ని వర్గాల ప్రేక్షకులకు ఇబ్బందిని కలిగిస్తోంది. ఈ క్రమంలోనే ఆమెను కన్నడ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలని ఆమె నటించే ఏ సినిమా కూడా కన్నడలో రిలీజ్ చేయకూడదు అని పెద్ద ఎత్తున రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై స్పందించి ఆమె తననే ఎందుకు కావాలని టార్గెట్ చేస్తున్నారు అంటూ ఒక లాంగ్ నోట్ ను కూడా విడుదల చేసింది. అయినా కూడా రష్మికను బ్యాన్ చేయాలి అంటూ చాలామంది పెద్ద ఎత్తున ర్యాలీ కూడా నిర్వహిస్తున్నారు. కానీ ఎట్టకేలకు దీనిపై రష్మిక స్పందించి కన్నడ ఇండస్ట్రీ తనను బ్యాన్ చేయలేదు అంటూ తెలిపింది.
అయితే రష్మికపై బ్యాన్ విధించలేదు అని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో ఈ విషయం కాస్త కన్నడ సంస్థల దృష్టికి వెళ్ళింది. అయితే వారు రష్మిక అబద్దం చెబుతోందని.. అసలు విషయం పై క్లారిటీ ఇచ్చారు.. అయితే కన్నడ సినిమాలలో నన్ను నిషేధించలేదని హీరోయిన్ రష్మిక మందన్న తెలిపిన విషయం తెలిసిందే. కానీ కన్నడ సంస్థలు మాత్రం తాము ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. త్వరలోనే ఏ విషయం అనేది స్పష్టంగా తెలియజేస్తాము అని తెలియజేసింది. దీన్ని బట్టి చూస్తే రష్మిక మందన్న అబద్ధం చెప్పిందా అంటూ ఇప్పుడు ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్స్.

ఏది ఏమైనా తనపై వస్తున్న వార్తలకు చెక్ పెట్టడానికే రష్మిక ఇలా చెప్పి ఉండవచ్చు అని అభిమానులు ఆమెకు మద్దతు పలుకుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం తెలుగు పుష్ప 2 సినిమాతో పాటు బాలీవుడ్ లో కూడా వరుస ప్రాజెక్టులు చేస్తూ బిజీగా గడిపేస్తోంది ఈ ముద్దుగుమ్మ. మరి ఇన్ని సినిమాలలో బిజీగా ఉన్న రష్మికను కన్నడ ఇండస్ట్రీ ఒకవేళ బ్యాన్ చేస్తే ఆ సినిమాల పరిస్థితి ఏంటి అంటూ కూడా నిర్మాతలు సందేహంలో పడినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

BAN

సంబంధిత వార్తలు: