రెబల్ స్టార్ తో కొత్త ఏడాది సందడి చేయడానికి సిద్ధమైన బాలయ్య..!
ఇకపోతే ఇప్పటివరకు సీజన్ 2 లో నారా చంద్రబాబు నాయుడు, లోకేష్, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి , మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి తదితరులు రాజకీయ రంగం నుండి హాజరవ్వగా.. సినీరంగం నుంచి రాధిక , అల్లు అరవింద్, సురేష్ బాబు, రాఘవేంద్రరావు , కోదండరామిరెడ్డి, విశ్వక్ సే, సిద్దు జొన్నలగడ్డ, అడవి శేష్ , శర్వానంద్ పాల్గొన్నారు. ఇప్పుడు రాబోతున్న ఎపిసోడ్ కి సీనియర్ హీరోయిన్ అయిన జయసుధ, జయప్రద పాల్గొనబోతున్నారు. ఇప్పటికే వీరి ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది. త్వరలోనే ప్రోమో కూడా రిలీజ్ చేయబోతున్నట్లు ఆహా ప్రకటించింది.
ఇకపోతే కొత్త ఏడాది మరింత హైప్ పెంచడానికి ఈ కార్యక్రమానికి రెబల్ స్టార్ ప్రభాస్ తో పాటు ఆయన ప్రాణ స్నేహితుడు యంగ్ హీరో గోపీచంద్ కూడా గెస్టుగా రాబోతున్నారు. రేపటి నుంచి ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభమవుతుంది అయితే కొత్త ఏడాది రెబల్ స్టార్ తో ఈ కార్యక్రమం మరింత క్రేజ్ తీసుకొస్తుందని నిర్వాహకులు అంచనాలు వేస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ ఈ షో కి వస్తున్నాడు అని తెలిసి అభిమానులు ఈ ఎపిసోడ్ కోసం చూస్తున్నట్లు సమాచారం. మొత్తానికైతే ఈ ఎపిసోడ్ తో అన్ స్టాపబుల్ షో మరో మెట్టు ఎక్కుతుందని చెప్పవచ్చు.