పూరి జగన్నాధ్ ఇన్ని కష్టాలు పడడానికి కారణం వారే !
ఇక అలా సినిమాల వలన కలిగిన నష్టాల మూలంగా ఎన్నో కష్టాలను అనుభవించాడు. అయినా సినిమాను వదిలి పెట్టలేదు , కాస్త సమయం తీసుకుని సినిమాలను చేస్తూ వచ్చాడు. కానీ ఈ మధ్య పూరి తీసిన పాన్ ఇండియా మూవీ "లైగర్" విడుదలకు ముందు ఎంత హైప్స్ ఉన్నాయో మనకు తెలిసిందే. అయితే లైగర్ అనుకున్న సక్సెస్ ను అందించకపోగా డిజాస్టర్ గా మిగిలి భారీ నష్టాలను మిగిల్చింది. ఈ సినిమా ప్లాప్ సెగ సినిమా నిర్మాత నుండి డిస్ట్రిబ్యూటర్ ల వరకు తగిలింది. పూరి జగన్నాధ్ పైన డిస్ట్రిబ్యూటర్లు డబ్బులు వెనక్కు కట్టాలని ఒత్తిడి తెస్తున్న సంగతి తెలిసిందే. అందుకే పూరి జగన్నాధ్ చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నాడు.
ఇటీవల ఈ కష్టనష్టాల గురించి పూరి ఈ మధ్యనే ఒక వీడియో ద్వారా చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఇక్కడ ఒక వాస్తవాన్ని పూరి సమాజానికి తెలియచేశాడు అనుకోవాలి. ఒక వ్యక్తి తన సమస్య కోసమో లేదా మరేదైనా విషయాన్ని వేరే వ్యక్తి దగ్గరకు మరొక వ్యక్తిని పంపితే, ఆ వ్యక్తి అతని దగ్గర మాట్లాడిన విషయాలు మాత్రమే కాకుండా వేరే విషయాలను కూడా కలిపి చెబుతారు. ఇలా చెప్పడం వలనే అసలైన సమస్య మొదలవుతుంది. ఆ మధ్యవర్తుల వలనే పూరి జగన్నాధ్ తన జీవితంలో ఎన్నో నష్టాలను చవిచూశాడని తెలుస్తోంది.