నారప్ప సినిమా కు ప్రమోషన్స్ మాములుగా లెవుగా..!!
కొన్ని సినిమా లు ఒక్క షో లేదా రెండు షోలకు పరిమితం అవ్వగా కొన్ని సినిమా లు మాత్రం ఒక రోజు రెండు రోజులు పూర్తి ఆటలు కొనసాగింది అని చెప్పొచ్చు, ఇప్పుడు వెంకటేష్ నటించిన నారప్ప సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు నిర్మాత సురేష్ బాబు కూడా ఇలా ఏర్పాట్లు చేశాడు. వచ్చే వారం లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కు సంబంధించిన పబ్లిసిటీ కార్యక్రమాలు కూడా బాగనే జరుగుతున్నాయి.
సాధారణంగా ఇలాంటి రిలీజ్ లు హడావిడి ఏమి లేకుండా జరుగుతాయి. కానీ సురేష్ బాబు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ నారప్ప సినిమా ను విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించడం బాగా ఆసక్తిగా ఉంది అంటూ చాలా మంది ఇలానే మాట్లాడుకుంటున్నారు. కరోనా సమయం లో నారప్ప సినిమా ను డైరెక్ట్ ఓటిటి ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం జరిగింది. ఆ సమయం లో వెంకటేశ్ అభిమానులు తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. నారప్ప సూపర్ హిట్ అయింది. థియేటర్లలో విడుదల అయ్యి ఉంటే కచ్చితంగా భారీ కలెక్షన్స్ నమోదు అయ్యి ఉండేవి అంటూ వెంకటేష్ అభిమానులు ఇప్పటికీ అభిప్రాయం చేస్తున్నారు. అందుకే సురేష్ బాబు ఈ సినిమా ను ఇప్పుడు థియేటర్ రిలీజ్ కి సిద్ధం గా చేశారు అని సమాచారం అందుతుంది. ఏదో నార్మల్ గా రిలీజ్ చేశాము అన్నట్లుగా కాకుండా భారీ ఎత్తుగానే ప్రమోట్ చేస్తూ విడుదల చేయడం అందరి దృష్టిని బాగా ఆకర్షిస్తుంది.