కొత్త హీరోను నిలబెట్టబోతున్న శ్రీకాంత్ అడ్డాల !
సెన్స్ బుల్ చిత్రాల దర్శకుడుగా పేరుగాంచిన శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ‘కొత్త బంగారులోకం’ అప్పట్లో బ్లాక్ బష్టర్ హిట్ అయితే ఆతరువాత మళ్ళీ అతడు హిట్ కొట్టిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు’ తీయడానికి ఒక దశాబ్ద కాలం పట్టింది. మధ్యలో తీసిన ‘బ్రహ్మోత్సవం’ భయంకరమైన ఫ్లాప్ గా మారడంతో ఇతడితో సినిమాలు తీయడానికి ఎవరు ముందుకు రాలేదు.
ఆతరువాత మళ్ళీ ఏర్పడిన పెద్ద గ్యాప్ ను ‘నారప్ప’ మూవీతో సక్సస్ ఫుల్ దర్శకుడుగా మారాలని ప్రయత్నించినప్పటికీ ఆమూవీ క్రితం సంవత్సరం ఓటీటీ లో విడుదల అవ్వడంతో శ్రీకాంత్ గురించి ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. ‘నారప్ప’ మూవీని ఓ టీటీ లో చూసిన వారు వెంకటేష్ నటన గురించి మాట్లాడుకున్నారు కానీ ఎవరు శ్రీకాంత్ అడ్డాల పై ప్రశంసలు కురిపించలేదు.
దీనితో ఈ మూవీ పై అతడు పెట్టుకున్న ఆశలు నీరుకారిపోయాయి. ఆమధ్య ఒక ప్రముఖ హీరోతో ఇతడి సినిమా ఉంటుంది అన్న ప్రచారం జరిగినప్పటికీ ఆ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కలేదు. తూర్పుగోదావరి జిల్లా ప్రాంతానికి చెందిన ఈ దర్శకుడి కథలలో గోదావరి జిల్లాల వాతావరణం బాగా కనిపిస్తోంది. ఇలాంటి సెన్స్ బుల్ సినిమాలను చూసే ప్రేక్షకులు బాగా తగ్గిపోవడంతో ఇతడితో సినిమాలు తీయడానికి ఎవరు ముందుకు రావడంలేదు.
ఇలాంటి పరిస్థితులలో ఈ దర్శకుడు ఒక కొత్త హీరోను ఇండస్ట్రీకి పరిచయం చేసే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. 'అఖండ' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్న స్టార్ ప్రొడ్యూసర్ మిర్యాల రవీందర్ రెడ్డి బావమరిదిని హీరోగా పరిచయం చేస్తూ శ్రీకాంత్ ఒక మూవీని తీస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఇటీవలే సైలెంట్ గా మొదలైంది అని తెలుస్తోంది. ఈమూవీ సక్సస్ అయితే శ్రీకాంత్ ప్రయత్నిస్తున్న స్టార్ హీరోల మల్టీ స్టారర్ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే ఆస్కారం ఉంది అన్నమాటలు వినిపిస్తున్నాయి..