మాటీవీలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 ప్రస్తుతం ఆఖరి దశకు చేరుకుంది. 14వ వారం ఇనాయ సుల్తానా ఎలిమినేట్ అవ్వడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు .ఎందుకు అంటే రేవంత్ కి పోటీ పడుతూ టైటిల్ రేసులో ఉన్న ఈమె ఎందుకిలా ఎలిమినేట్ అయ్యింది అంటూ ఆమె అభిమానులు చాలా మంది బాధపడుతున్నారు. అయితే ఓటింగ్ పరంగా థర్డ్ ప్లేస్లో ఉన్న ఇనాయా ఎందుకు ఎలిమినేట్ అవుతుంది అని బిగ్ బాస్ మొత్తం మోసం అంటూ విమర్శలు చేస్తున్నారు .అయితే ఈ నేపథ్యంలోనే నాగార్జున కూడా ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు
సోషల్ మీడియా వేదికగా వార్తలు వినిపిస్తున్నాయి .ఇక అదేంటంటే నాగార్జున బిగ్ బాస్ మళ్లీ రాబోయే సీజన్ లకు హోస్ట్ గా చేయకుండా గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తుంది .దానికి ప్రధాన కారణం హౌస్ లో బాగా ఆడే వాళ్ళని ఎలిమినేట్ చేస్తూ వీక్ కంటెస్టెంట్ లను ఉంచుతున్నారని నాగార్జునకు కూడా ఇదంతా నచ్చడం లేదని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. నాగార్జునకు ఈ విషయాలన్నీ తెలిసి ఈ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారని చాలామంది భావిస్తున్నారు. కానీ నాగార్జునకి పూర్తి వివరాలు ఇప్పటివరకు తెలియదట.
ఎలిమినేట్ చేయడం అనేది పూర్తిగా బిగ్ బాస్ టీం బాధ్యత అని స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన ఇనాయ ఎలిమినేట్ అవ్వడం నాగార్జునకి కూడా నచ్చలేదని.. ఈ నేపథ్యంలోనే నాగార్జున బిగ్ బాస్ యాజమాన్యంతో మాట్లాడి నేను మీ షో కి హోస్టుగా చేయను అని వేరే వాళ్ళు ఎవరైనా చేస్తాను అంటే వారిని తీసుకోండని కేవలం ఇనాయ మాత్రమే కాదు ఇప్పటికే చాలామంది స్ట్రాంగ్ కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేసిన విషయంలో బిగ్ బాస్ ఊహించని ట్విస్టులు ఇచ్చారని దీనితో విసిగిపోయిన నాగార్జున నేను షో లో ఉండను అంటూ తేల్చి చెప్పేసారట. దీంతో మీరు లేకపోతే షో నడవదు సార్ మీరు బ్రాండ్ అంటూ బిగ్ బాస్ టీం నాగార్జునని బ్రతిమలాడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి .దీంతో ఇప్పుడు నాగార్జున బిగ్ బాస్ పై ఇన్ని విమర్శలు వచ్చినప్పటికీ హోస్ట్ గా వ్యవహరిస్తారా లేదా అన్నది వేచి చూడాలి..!!