యంగ్ టైగర్
జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే ఎన్నో
మూవీ లలో తన అద్భుతమైన నటన తో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. కొన్ని రోజుల క్రితమే
జూనియర్ ఎన్టీఆర్ "ఆర్ ఆర్ ఆర్" అనే భారీ బడ్జెట్ పాన్
ఇండియా మూవీ లో
హీరో గా నటించి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. మరికొన్ని రోజుల్లోనే
జూనియర్ ఎన్టీఆర్ , కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కబోయే
మూవీ లో
హీరో గా నటించబోతున్నాడు. ఆ తర్వాత కే జి ఎఫ్
మూవీ తో పాన్
ఇండియా రేంజ్ లో గొప్ప గుర్తింపు ను తెచ్చుకున్న దర్శకులలో ఒకరు అయినటువంటి
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కబోయే
మూవీ లో
హీరో గా నటించబోతున్నాడు.