నటి అనుపమ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసినా అల్లు అరవింద్..!!
మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథను కూడా అందించారు. ఆయన శిష్యుడు “కుమారి 21ఎఫ్” చిత్ర దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర టీజర్ కి, శ్రీమణి సాహిత్యం అందించిన “నన్నయ్య రాసిన” పాటకు “ ఫర్స్ట్ టైం ఇవ్వు పిల్ల” అనే పాటలకు ప్రేక్షకులనుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా విడుదలైన ఏడు రంగుల వాన పాట ఆకట్టుకుంటుంది. అయితే తాజాగా ఈ ప్రమోషన్లలో పాల్గొన్న అల్లు అరవింద్.. అనుపమ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. “గత నాలుగు మాసాలుగా నెలకొక రిలీజ్ చేస్తున్నా మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు , బాగా సపోర్ట్ చేస్తున్న మీడియా వారికి మా ధన్యవాదాలు. సుకుమార్ నాతో ఒక విచిత్రమైనలవ్ స్టోరీ చేద్దామని చెప్పడంతో వాసు కూడా తెగ సంబరపడిపోయాడు. మేము తీసిన “18 పేజెస్” ఒక సాధారణ మైన లవ్ స్టోరీ కాదు. చాలా డిఫరెంట్ గా ఉంటుంది అని వివరించారు. గోపి గారు ఇప్పటి వరకు మా బ్యానర్ లో ఏడు సినిమా లు కూడా చేశాడు అవన్నీ మ్యూజికల్ గా బిగ్ హిట్ అయ్యాయి సాంగ్స్ ఈ కు కూడా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. తన హృదయంలో ఆవేదన గానీ ఆ రాగం గానీ లేకపోతే ఇంతమంచి పాటలు రావు. కార్తికేయ తరువాత అదే జోడీతో ఈ 18 పేజెస్ రావడం నాకు చాలా హ్యాపీ గా ఉంది. అందరూ నేను చేసే లు చూసి ఇది అరవింద్ గారి అంటారు కానీ అంతా బన్నీ వాసే తన టీంతో మా లను చాలా చక్కగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాడు .
నిఖిల్ సిద్దార్థ్ చాలా డెడికేటెడ్ గా వర్క్ చేస్తాడు. నాకు న్యాచురల్ గా నటించించే నటి అనుపమ అంటే చాలా ఇష్టం. తనలో ఎలాంటి నటన ఉండదు. చాలా ట్రాన్స్ ది గా ఉంటుంది మరీ. మనసులో ఏది ఉంటే అది మొహంలో కనిపిస్తుంది. ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. తనను చూసినప్పుడల్లా తనలాంటి కూతురు ఉంటే బాగుండు అని నాకు అనిపిస్తుంది. అందుకే నాకు చాలా తనంటే చాలా ఇష్టం. చాలా చక్కటి సాహిత్యాన్ని అందించే లిరిసిస్ట్ శ్రీమణి మా ఫ్యామిలో మెంబెర్ అయ్యాడు.ఈ లో అందరూ చాలా బాగా నటించారు. ఈ నెల 23 న వస్తున్న మా చిత్రాన్ని అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా అభిమానుల్ని కోరుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చారు