విక్రమ్ గెటప్ పై ఆసక్తికర చర్చలు !

Seetha Sailaja
దక్షిణ భారత సినిమా రంగంలో విలక్షణమైన పాత్రలు చేసే విషయంలో కమలహాసన్ తరువాత విక్రమ్ పేరు మాత్రమే వినిపిస్తుంది. కమల్ ‘దశావతారం’ మూవీలో 10 గెటప్స్ లో కనిపిస్తే విక్రమ్ కూడ ‘కోబ్రా’ మూవీలో చాల డిఫరెంట్ గెటప్స్ లో కనిపించి అందరికీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. మంచి నటుడుగా పేరుగాంచిన విక్రమ్ ‘అపరచితుడు’ మూవీ తరువాత ఒక్క హిట్ కూడ కొట్టలేకపోతున్నాడు.



విక్రమ్ హిట్ అన్న పదం విని దాదాపు 15 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇన్ని పరాజయాలు మరో నటుడుకి ఉండి ఉంటే ఈపాటికి అతడి పేరును కూడ జనం మర్చిపోయి ఉండేవారు. అయితే ఇప్పటికీ విక్రమ్ సినిమా వస్తోంది అంటే ఆమూవీలో ఏదోఒక ఆసక్తికర అంశం ఉంటుంది అన్న అంచనాలు ఇప్పటికీ ప్రేక్షకులలో ఉన్నాయి.



ఈ పరిస్థితుల మధ్య రంజిత్ పా దర్శకత్వంలో ప్రస్తుతం విక్రమ్ నటిస్తున్న మూవీ పై చాల ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘తంగలాన్’ అన్న టైటిల్ తో నిర్మాణం జరుపుకుంటున్న ఈ మూవీలో విక్రమ్ పొడవాటి జుట్టు మరియు గడ్డం తో పాటు మొఖం నల్ల రంగుతో చాల భయంకరంగా కనిపిస్తాడట. ఈ సినిమా లో విక్రమ్ పాత్ర గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. లేటెస్ట్ గా ఈమూవీ యూనిట్ వర్గాలు విడుదల చేసిన ఒక స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



దీనితో ఈ మూవీ పై భారీ అంచనాలు పెరుగుతున్నాయి. రంజిత్ పా విభిన్నమైన దర్శకుడు అన్న పేరు ఉంది. దీనితి అతడి దర్శకత్వంలో విక్రమ్ కు హిట్ వచ్చి తీరుతుంది అన్న అభిప్రాయం ఆయన అభిమానులలో కలుగుతోంది. ఈ సినిమా నిర్మాణంలో ఉంటూ ఉండగానే విక్రమ్ మహాభారత యుద్ద నేపధ్యంలో కర్ణుడి జీవితం పై తీస్తున్న ఒక భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నాడు అన్న వార్తలు వస్తున్నాయి. ఈసినిమాను ప్రపంచ భాషలు అన్నింటిలోను విడుదల చేస్తారు అన్నమాటలు వినిపిస్తున్నాయి


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: