బాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి పరిణితి చోప్రా గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే అనేక బాలీవుడ్ మూవీ లలో నటించి బాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది . అలాగే ఇప్పటి వరకు పరిణీతి చోప్రా నేరు గా ఒక్క తెలుగు మూవీ లో కూడా నటించక పోయినప్పటికీ ఈ ముద్దు గుమ్మ తాను నటించిన హిందీ మూవీ ల ద్వారానే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు ను దక్కించుకుంది . 2012 వ సంవత్సరంలో పరిణితి చోప్రా నటించిన ఇష్క్ జాదే సినిమా కమర్షియల్ గా విజయం సాధించడమే కాక , విమర్శకుల నుండి ప్రశంసలు కూడా పొందింది .
ఆ తర్వాత పలు మూవీ లలో నటించిన ఈ ముద్దు గుమ్మ తన నటన తో ఎంతో మంది ప్రేక్షకుల మరియు విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దు గుమ్మ సౌత్ ఇండస్ట్రీ సినిమాలలో నటించడం పై కొన్ని కామెంట్లు చేసింది ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పరిమితి చోప్రా మాట్లాడుతూ ... తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం భాషలో ఏదైనా ఓకే. ఒక మంచి మూవీ లో నటించాలని చాలా కాలంగా ఎదురుచూస్తున్నాను. ఒక మంచి డైరెక్టర్ , సరైన కథ కలిస్తే అద్భుతమైన ప్రాజెక్ట్ బయటకు వస్తుంది. అలాంటి ప్రాజెక్ట్ లో నాకు అవకాశం రావాలి అని పరిణీతి చోప్రా తాజాగా పేర్కొంది. ఇలా పరిణితి చోప్రా సౌత్ ఇండియన్ మూవీ లలో నటించడం పై చాలా ఆసక్తిని చూపిస్తున్నట్లు తాజాగా పేర్కొంది.