డేంజర్ జోన్ లో ఉన్న ఆది రెడ్డి - శ్రీసత్య..బిగ్ బాస్ ఊహించని ఎలిమినేషన్..!?

Anilkumar
బిగ్ బాస్ సీజన్ 6 లో ఎప్పుడు జరగని విధంగా వింత సంఘటనలు మరియు వింత నిర్ణయాలు ఈ సీజన్ లో జరిగాయి అని చెప్పాలి. 21 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన ఈ షో లో గతవారం ఇనాయ ఎవరు ఊహించని విధంగా ఎలిమినేట్ అయింది. ఇక ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్స్ ఉంటాయని నాగార్జున ఆదివారం ఎపిసోడ్లో చెప్పాడు. ఇక ఆదివారం అర్ధరాత్రి నుండి బుధవారం వరకు నమోదైన ఓట్ల ని పరిగణలోకి తీసుకొని ఈ ఎలిమినేషన్స్ ఉంటాయని నాగార్జున చెప్పాడు. అయితే ప్రస్తుతం ఉన్న ఓటింగ్ ప్రకారం టాప్ టు స్థానంలో రేవంత్ మరియు శ్రీహన్ ఉండగా

 బాటమ్ టూ లో ఆదిరెడ్డి మరియు శ్రీ సత్య ఉన్నారు .ఇక డేంజర్ జోన్ లో ఉన్న వీళ్ళిద్దరి నుండి ఎవరో ఒకరు కచ్చితంగా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఆ ఒక్కరు ఎవరు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. అయితే జరిగిన ఓటింగ్ ప్రకారం శ్రీ సత్య ఎలిమినేట్... కానీ సోషల్ మీడియాలో పాపులర్ వెబ్సైట్స్ నిర్వహిస్తున్న అధికారిక పోలింగ్లో శ్రీ సత్య ఆదిరెడ్డి తో పోలిస్తే 50 శాతం తక్కువ ఓట్లతో కొనసాగుతుంది. అందుకే శ్రీ సత్య ని ఎలిమినేట్ అవ్వాలి అని కానీ బిగ్ బాస్ షోలో ఈమధ్య ఊహించని ఫలితాలు వస్తున్నాయని బిగ్ బాస్ కి తోచిన కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేస్తున్నారు

అని గతవారం ఇనాయ ఎలిమినేషన్ కూడా ఈ విధంగానే జరిగింది అని వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. అయితే టాప్ టు కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలపడగలిగే  ఫాలోయింగ్ ని సంపాదించుకున్న ఇనాయ ఎలిమినేట్ అవ్వడంతో బిగ్ బాస్ షో పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈరోజు జరగబోయే మిడ్ వీక్ ఎలిమినేషన్స్ కూడా అలాగే ఉంటుందా అని భయపడుతున్నారు. అయితే ఒకవేళ శ్రీ సత్య ని ఎలిమినేట్ చేయకుండా ఆదిరెడ్డిని ఎలిమినేట్ చేస్తే మాత్రం ఇప్పటివరకు జరిగిన ఎలిమినేషన్స్ అన్నీ కూడా అన్యాయంగానే జరిగాయి అని నిర్ధారణకు రావచ్చు అని అంటున్నారు బిగ్ బాస్ అభిమానులు. దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: