పవన్ కళ్యాణ్ సినిమా నుంచి పూజా అవుట్..!?

Anilkumar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఆయన ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ ఇస్తున్నాడు అని చెప్పాలి. గత కొద్దిరోజుల్లో హరిహర వీరమల్లు సినిమా షూటింగ్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో మరో ప్రాజెక్టు అనౌన్స్ చేయడం జరిగింది. ఇక ఈ సినిమాపై ఇప్పటికే విపరీతమైన బజ్ కూడా ఏర్పడింది. మరోవైపు గత రెండు రోజుల క్రితం డైరెక్టర్ హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలతో ఈ సినిమా  గా ప్రారంభించారు. అయితే గతంలో పవన్ కళ్యాణ్ మరియు హరీష్ కాంబినేషన్ లో 

వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఎంత హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. దాని తర్వాత రాబోతున్న ఈ సినిమాపై ఎప్పటికీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాని తమిళ్ సూపర్ హిట్ తెలుగు సినిమాకి రీమిక్స్ అన్నారు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు .. ఈ సినిమా రీమేక్ వద్దంటూ నెట్టింట పెద్ద గొడవ చేశారు. అయితే ఈ విషయంపై చిత్ర బృందం నుంచి ఎలాం.టి స్పందన లేదు. అయితే తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడిగా పూజ హెగ్డే హీరోయిన్గా ఎంపికైన సంగతి మన అందరికీ తెలిసిందే.

ఇక తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్టు నుండి పూజ హెగ్డే తప్పుకుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇటీవల ప్రారంభమైన ఈ సినిమాకి సంబంధించిన పూజ కార్యక్రమాల్లో పూజా హెగ్డే కనిపించలేదు. టైటిల్ పోస్టర్ అనౌన్స్మెంట్ లోను ఈమె పేరు కూడా కనిపించలేదు. దీంతో ఈమె ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లుగా ఊహాగానాలు వస్తున్నాయి. అయితే పూజ హెగ్డే మాత్రం ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. ఈమె తెలుగులోనే కాకుండా హిందీలో సినిమాలను చేస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న SSMB 28 సినిమాల్లో ఎంపికైంది. దాంతోపాటు హిందీలో సల్లు భాయి సరసన కూడా నటిస్తుంది. ఇక ఈ సినిమా నుండి పూజ హెగ్డే తప్పుకోవడంతో ఆమె ప్లేస్ లో ఏ హీరోయిన్ ని పెడతారు అన్నది చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: